భారతీయులకు అమెరికా వీసాలు బంద్? | Sakshi
Sakshi News home page

భారతీయులకు అమెరికా వీసాలు బంద్?

Published Tue, Jun 28 2016 7:40 PM

భారతీయులకు అమెరికా వీసాలు బంద్? - Sakshi

వాషింగ్టన్: 23 దేశాలకు వీసాల మంజూరును నిలిపివేయాలంటూ ఒక  టాప్ అమెరికన్ సెనేటర్  అమెరికా అధ్యక్షుడు  ఒబామాను కోరారు. భారతదేశం,  చైనా సహా 23 దేశాల  పౌరులకు  ఇచ్చే వలస, వలసేతర వీసాలు జారీని ఆపి వేయాలని ఒబామా అడ్మినిస్ట్రేషన్ కు సూచించారు.  అక్రమ వలసదారులును తిరిగి స్వీకరించడంలో ఆయా దేశాలు సహకరించడం లేదని ఆరోపిస్తూ ఈ చర్యకు పక్రమించాయి.

హంతకులు సహా, ప్రమాదకరమైన  నేరస్తులను  ప్రతీరోజు  రిలీజ్ చేస్తున్నామని, ఆయా దేశాలు వారిని వెనక్కి  రప్పించడంలో  తమకు సహకరించడం లేదని  రిపబ్లికన్ సెనేటర్ చుక్ గ్రాస్లీ ఆరోపించారు. ఆయన ఈమేరకు హోం ల్యాండ్ సెక్యూరిటీ  కౌన్సిల్ కి లేఖ రాశారు. ఇలాంటి వారిని  ప్రతి రోజు విడుదల చేస్తున్నామని హోంల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి జె జాన్సన్ కు రాసిన ఆయన లేఖలో కోరారు. అంతకుముందు రెండేళ్లలో 6,100 మంది విడుదలైతే ఒక్క 2015 లోనే 2,166 మందిని ఇలా విడుదల చేశామని తెలిపారు. ప్రస్తుతం, 23 దేశాలు అమెరికాతో సహకరించడం లేదని గ్రాస్లీ తన లేఖలో పేర్కొన్నారు.

మొత్తం 62 దేశాల వారిని అమెరికా అవియుధేలుగా గుర్తించినప్పటికీ, 23 దేశాలను పెడసరి దేశాల ఖాతాలో చేర్చింది. ముఖ్యంగా క్యూబా, చైనా, సోమాలియా, భారత్, గయానాలను మరింత  మొండిదేశాలుగా తేల్చి పారేసింది. వీటిని  టాప్ ఫైవ్ లిస్ట్ లో చేర్చింది.  ఇమ్మిగ్రేషన్ అండ్ నేషనాలిటీ చట్టం 243(డీ) ప్రకారం  ఈ దేశాల వారి రాకపై చర్యలు తీసుకోవాలని చుక్ గ్రాస్లీ కోరారు.  2001లో ఒక్క గయానా విషయంలోనే ఈ సెక్షన్  ఒకసారి మాత్రం వాడామని,  దీంతో తక్షణమే గయనా దిగి వచ్చి సహకారం అందించిందని గుర్తు చేశారు.
 

Advertisement
Advertisement