కేంద్ర బడ్జెట్‌పై చిదంబరం రేటింగ్‌

Union Budget 2020 Chidambaram Rating On Budget - Sakshi

న్యూఢిల్లీ : బడ్జెట్‌పై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం వ్యంగంగా స్పందించారు. శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌కు రేటింగ్‌ ఇవ్వమని విలేకర్లు అడగ్గా ఆయన ఆసక్తికర సమాధానమిచ్చారు. మీరు బడ్జెట్‌కు 1 నుంచి 10 వరకు ఎంత రేటింగ్‌ ఇస్తారన్న ప్రశ్నకు.. 1,0.. ఈ రెండు నెంబర్లలో ఏదైనా తీసుకోవచ్చంటూ సమాధానమిచ్చారు. అనంతరం బడ్జెట్‌ కేటాయింపులపై ఆయన మాట్లాడుతూ..160 నిమిషాల పాటు సుదీర్ఘంగా సాగిన బడ్జెట్‌ ప్రసంగంలో తనకు ఏదీ గుర్తు లేదని అన్నారు. దేశంలో పేద, మధ్య తరగతి ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని, వాటిని పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన  సవాళ్లను ఎదుర్కొంటోందని,  గత ఆరు త్రైమాసికాలలో వృద్ధి రేటు క్షీణించిందని తెలిపారు. ఈ మధ్య కాలంలో ఇంత సుధీర్ఘమైన బడ్జెట్‌ ప్రసంగాన్ని తాను వినలేదంటూ ఎద్దేవా చేశారు. (బడ్జెట్‌ 2020 : కేంద్ర బడ్జెట్‌ హైలైట్స్‌)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top