యూనియన్‌ బ్యాంకు లాభం రూ.153 కోట్లు | Union Bank Q3 Profit at Rs 153 cr | Sakshi
Sakshi News home page

యూనియన్‌ బ్యాంకు లాభం రూ.153 కోట్లు

Jan 21 2019 4:09 PM | Updated on Jan 21 2019 4:15 PM

Union Bank Q3 Profit at Rs 153 cr  - Sakshi


సాక్షి, ముంబై : ప్రభుత్వ రంగ సంస్థ యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నిరాశాజనక ఫలితాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 3వ త్రైమాసికంలో విశ్లేషకుల అంచనాలను అందుకోలేకపోయింది. ఈ ఏడాది క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో యూనియన్‌ బ్యాంక్‌ రూ. 153 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది క్యూ3లో రూ.1250 కోట్ల నికర నష్టం నమోదైంది. అయితే రూ. 230-300 కోట్ల నికర లాభం ఆర్జించనుందని విశ్లేషకులు అంచనా వేశారు.  అలాగే అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో రూ .9,133.58 కోట్లతో పోలిస్తే ఈ త్రైమాసికంలో మొత్తం ఆదాయం 9,572.58 కోట్లకు పెరిగింది. ఇందుకు ప్రధానంగా ప్రొవిజన్లు తగ్గడంతోపాటు, ఆస్తుల(రుణాల) నాణ్యత మెరుగుపడటం దోహదం చేసింది.   

ప్రొవిజన్లు, కంటెంజెన్సీలు సగానికి తగ్గి రూ. 1617 కోట్లకు చేరాయి. కాగా.. నికర వడ్డీ ఆదాయం(ఎన్‌ఐఐ) మాత్రం 2 శాతం క్షీణించి రూ. 2494 కోట్లకు పరిమితమైంది. క్వార్టర్‌ టూ క్వార్టర్‌ టూ గ్రాస్‌ఎన్‌పీఏ స్వల్పంగా (0.88),నికర ఎన్‌పీఏలు 2 శాతం తగ్గాయి. వార్షిక ప్రాతిపదికన 2017-18 నాటి మూడవ త్రైమాసికంలో 13.03 శాతం నుంచి మొత్తం నికర ఆదాయం (ఎన్‌పీఏ) 15.66 శాతం పెరిగింది. నికర ఎన్ఎపిఏలు కూడా గత సంవత్సరం నుంచి 6.96 శాతం నుంచి 8.27 శాతానికి పెరిగాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement