ఉబర్ స్మార్ట్ ఫోన్ యాప్స్ బ్యాన్
రైడ్-హైలింగ్ గ్రూప్ ఉబర్ స్మార్ట్ ఫోన్ యాప్స్ పై ఇటలీ నిషేధం విధించింది.
రైడ్-హైలింగ్ గ్రూప్ ఉబర్ స్మార్ట్ ఫోన్ యాప్స్ పై ఇటలీ నిషేధం విధించింది. ఉబర్ కార్ల కోసం వాడే స్మార్ట్ ఫోన్ యాప్స్ ను బ్యాన్ చేస్తున్నట్టు ఇటలీ కోర్టు తీర్పు చెప్పిందని అక్కడి మీడియా రిపోర్టు చేసింది. అన్యాయకరమైన పోటీ వాతావరణాన్ని వారు ఏర్పాటుచేస్తున్నారని కోర్టు పేర్కొంది. బ్లాక్, లక్స్, ఎస్యూవీ, ఎక్స్, ఎక్స్, వ్యాన్ ఫోన్ అప్లికేషన్లను ఉబర్ వాడటానికి వీలులేదని, వాటిని ప్రమోట్ చేయడాన్ని ఒప్పుకోమని కోర్టు తేల్చిచెప్పినట్టు పేర్కొంది.
ఆ సర్వీసులను అడ్వర్ టైజ్ కూడా చేయొద్దని ఇటలీ కోర్టు తెలిపింది. ఒకవేళ ఈ శాన్ ఫ్రాన్సిస్కో కంపెనీ కోర్టు ఆర్డర్లను ఉల్లంఘిస్తే, రోజుకు 10వేల యూరోలు(10,590 డాలర్లు) చెల్లించాల్సి వస్తుందని ఉబర్ కు కోర్టు వార్నింగ్ ఇచ్చింది. అయితే కోర్టు ఆర్డర్ పై తాము అప్పీల్ కు వెళ్తామని, ఈ తీర్పుపై సస్పెన్షన్ ఇవ్వాలని కోరతామని ఉబర్ చెబుతోంది. ఈ తీర్పు తమల్ని షాక్ కు గురిచేసిందని ఉబర్ పేర్కొంది.