ఎయిరిండియాపై ఆనంద్‌ మహీంద్ర ఏమన్నారంటే...

Tough action needed to revive Air India, says Anand Mahindra       - Sakshi

సాక్షి, ముంబై:  ఎయిరిండియా  వాటా అమ్మకంపై నెలకొన్న సంక్షోభంపై  ప్రముఖ పారిశ్రామికవేత్త,  మహాంద్ర గ్రూపు  ఛైర‍్మన్‌  ఆనంద్ మహీంద్ర స్పందించారు.  ఎయిరిండియా వాటా కొనుగోలుకు ఎవరూ ముందుకు రాని  పరిస్థితిపై ఎయిర్ ఇండియా మాజీ  బోర్డు సభ్యుడు కూడా  అయిన ఆనంద్‌ శుక్రవారం వరుస ట్విట్లలో తన  అభిప్రాయాలను వెల్లడించారు.  ఎయిరిండియా వాటా అమ్మకం  వ్యవహారం జాతి గౌరవానికి సంబంధించి అంశంగా మారిందని వ్యాఖ్యానించారు. బిడ్‌ వేయడానికి ఎవరూ ఆసక్తి చూపకపోవడం  సంస్థ  పూర్వ ప్రాభవాన్ని తిరిగి తీసుకువచ్చేందుకు అవసరమైన కఠినమైన  చర్యల్ని గుర్తు చేసిందని ఆనంద్‌ ట్వీట్‌ చేశారు. ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ పునర్‌వైభవం  పొందాలంటే ఛైర్మన్‌కు పూర్తి స్వయం ప్రతిపత్తి కల్పించాలన్నారు. అలాగే  రాజకీయ  ఒత్తిళ్లనుంచి వారిని దూరంగా ఉంచాలన్నారు.  ఈ నిర్ణయాత్మక  చర్యలపై విస్తృతమైన మద్దతు కావాలని, ఇదొక రాజకీయం అవకాశంగా ఆయన పేర్కొన్నారు.

ఆనంద్‌ మహీంద్ర ప్రతిపాదించిన అయిదు ముఖ్య  అం‍శాలు:

  •  పూర్తిగా  ఎయిరిండియా బిజినెస్‌ పుంజుకున్న తరువాత మాత్రమే  వాటాను విక్రయించేందుకు ప్రభుత్వంం పూనుకోవాలి.
  •  ఇండియన్‌ మెట్రోమ్యాన్‌ ఈ. శ్రీధరన్‌ను ఎయిర్‌లైన్‌ ఛైర్మన్‌, సీఈవోగా నియమించాలి.
  •  ఎయిరిండియాను తిరిగి గాడిలోపెట్టేందుకు కొత్త ఛైర‍్మన్‌కు  పూర్తి  స్వేచ్ఛనివ్వాలి.
  •  రాజకీయ  ఒత్తిళ్లనుంచి  ఛైర్మన్‌ను పూర్తిగా దూరంగా ఉంచాలి .
  •  ఎలాంటి కఠినమైన నిర్ణయాలనైనా అమలు చేసేందుకు కొత్తగా ఎంపికైన ఛైర్మన్‌కు పూర్తి నైతిక మద్దతునివ్వాలి.
Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top