రేటు తగ్గింపు ఖాయం! | Tomorrow RBI Policy Meeting | Sakshi
Sakshi News home page

రేటు తగ్గింపు ఖాయం!

Jun 5 2019 10:27 AM | Updated on Jun 5 2019 10:27 AM

Tomorrow RBI Policy Meeting - Sakshi

ముంబై: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష గురువారం జరగనుంది. గవర్నర్‌ శక్తికాంత దాస్‌ నేతృత్వంలో జరగనున్న ఈ పరపతి కమిటీ సమావేశం సందర్భంగా రెపో రేటును (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 6 శాతం) 35 బేసిస్‌ పాయింట్లవరకూ తగ్గించే అవకాశం ఉందన్న అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి. శక్తికాంత్‌ దాస్‌ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇప్పటికే ఆర్‌బీఐ రెపోరేటు అరశాతం తగ్గిన సంగతి  తెలిసిందే. రేటు తగ్గింపు ఖాయమన్న అంచనాలకు ప్రధాన                       కారణాలను చూస్తే...
అటు వినియోగదారుల సూచీ ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం, ఇటు టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం ప్రభుత్వం, ఆర్‌బీఐ నిర్దేశిత 4 శాతంలోపు కొనసాగుతోంది.
మరోవైపు పారిశ్రామిక ఉత్పత్తిలో వృద్ధి ధోరణులు పూర్తిగా ఆగిపోయింది. ఇంకా చెప్పాలంటే మార్చిలో వృద్ధిలేకపోగా క్షీణతలోకి పారిశ్రామిక రంగం జారింది. తయారీ, సేవల రంగాలు మందగమనంలోకి జారిపోయాయి.   
గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో (జనవరి–మార్చి) భారత్‌ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ఐదేళ్ల కనిష్టస్థాయి 5.8 శాతానికి పడిపోయింది.
ఆయా అంశాల నేపథ్యంలో వృద్ధిరేటు స్పీడ్‌కు రెపో రేటు తగ్గింపునకే అవకాశాలు ఉన్నాయన్నది మెజారిటీ వర్గాల విశ్వాసం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement