మార్కెట్లకు శుక్రవారం సెలవు

today (Oct 20) holiday for markets

సాక్షి,ముంబై: దీపావళి పర్వదినం సందర్భంగా మార్కెట్లకు సెలవు.  అయితే దీపావళి స్పెషల్‌ ముహూరత్‌ ట్రేడింగ్‌తో స్టాక్‌ మార్కెట్లలో 2074 ఏడాది ప్రారంభమైంది. ఈ మూరత్‌ ట్రేడింగ్‌లో ట్రేడర్లు లాభాల స్వీకరణకుదిగడంతో మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 194 పాయింట్లు క్షీణించి 32,390 వద్ద, నిఫ్టీ 64 పాయింట్లు  నష్టపోయి 10,146 వద్ద  స్థిరపడ్డాయి.
దీపావళి లక్ష్మీపూజ  అనంతరం షేర్లలో లావాదేవీలు నిర్వహించుకునేందుకు వీలుగా స్టాక్‌ ఎక్స్ఛేంజీలు సాయంత్రం గంటపాటు మూరత్‌(ముహూరత్‌) ట్రేడింగ్‌ నిర్వహించడంఆనవాయితీగా వస్తున్న సంగతి తెలిసిందే. కాగా  శుక్రవారం(20న) బలి ప్రతిపాద సందర్భంగా మార్కెట్లకు సెలవు.   దీంతో  లాంగ్‌ వీకెండ్‌ తరువాత సాధారణ ట్రేడింగ్‌ తిరిగి సోమవారం(23) ఉదయం 9.15కు యధావిధిగా మార్కట్లు ప్రారంభమవుతాయి.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top