త్వరలో మూడు సరికొత్త శ్యామ్సంగ్ ఫోన్లు

త్వరలో మూడు సరికొత్త శ్యామ్సంగ్ ఫోన్లు


ఏటి&టీ సంస్థ మూడు సరికొత్త శ్యామ్సంగ్ ఆండ్రాయిడ్ ఫోన్లను అతి త్వరలో మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. మరి ఆ కొత్త ఫోన్లేమిటో వాటి ధరలతోపాటు ఫీచర్లు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలిస్తే..1. గెలాక్సీ ఎక్స్ప్రెస్ ప్రైమ్ గో ఫోన్

కొత్త ఆండ్రాయిడ్ వెర్షన్ మార్ష్మాల్లోను గో ఫోన్లో పొందుపరిచింది శ్యామ్సంగ్. 5 అంగుళాల సూపర్ అమోలెడ్ స్ర్కీన్తో 2600ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో రానున్న ఈ ఫోన్లో 16 జీబీ ఇంటర్నల్ మెమోరీ సామర్థ్యం కలిగి ఉంటుంది. 5 ఎంపీ రీర్ కెమెరా, 2 ఎంపీ ఫ్రంట్ కెమెరాలతో 1.5 జీబీ ర్యామ్తో గో ఫోన్ అందుబాటులోకి రానుంది. గెలాక్సీ ఎక్స్ప్రెస్ ప్రైమ్ గో ఫోన్ ధరను 129 డాలర్లుగా నిర్ణయించారు.2. గెలాక్సీ ఎక్స్ప్రెస్ 3

గెలాక్సీ ఎక్స్ప్రెస్ 3 ఫోన్ 4.5 అంగుళాలతో సూపర్ అమోలెడ్ స్కీన్తో స్మార్ట్ఫోన్ ప్రియులను ఆకర్షించనుంది. 2050 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం, 5 ఎంపీ కెమెరాతో 79.99 డాలర్ల ఖరీదుతో ఎక్స్ప్రెస్ 3 అందుబాటులోకి రానుంది.3. గెలాక్సీ జె3

మెమోరీ కార్డు అవసరం లేకుండా 16 జీబీ నుంచి 128 జీబీ వరకు నిల్వ సామర్థ్యాన్ని పెంచుకోగలిగే విధంగా డిజైన్ చేసిన జె౩ మొబైల్ 256 ఎన్క్రిప్షన్తో శ్యామ్సంగ్ నాక్స్ సెక్యూరిటీ హార్డ్వేర్ లెవల్ను వినియోగించుకుంటుంది. 5 అంగుళాల స్క్ర్రీన్తో 5ఎంపీ రీర్ కెమెరా, 2 ఎంపీ ఫ్రంట్ కెమెరాలతో జె౩ అందుబాటులోకి రానుంది. 1.5 జీబీ ర్యామ్ సామర్థ్యం కలిగిన జే౩లో ఏ7 చిప్సెట్ను అమర్చారు.ఈ మూడు రకాల ఫోన్లను మే 6న మార్కెట్లో అమ్మకాలకు విడుదల చేయనున్నట్లు శ్యామ్సంగ్ తెలిపింది. కాగా, జె౩ను నెలకు 5.67 డాలర్ల ఈఎంఐతో 24 నెలల్లో చెల్లించే సౌకర్యం కూడా ఉంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top