తెలుగు రాష్ట్రాల్లో ఇండీక్యాష్ ఏటీఎంలు @ 1,500 | Telugu States in Indicash ATM @1,500 | Sakshi
Sakshi News home page

తెలుగు రాష్ట్రాల్లో ఇండీక్యాష్ ఏటీఎంలు @ 1,500

Sep 24 2016 2:33 AM | Updated on Sep 4 2017 2:40 PM

తెలుగు రాష్ట్రాల్లో ఇండీక్యాష్ ఏటీఎంలు @ 1,500

తెలుగు రాష్ట్రాల్లో ఇండీక్యాష్ ఏటీఎంలు @ 1,500

టాటా కమ్యూనికేషన్స్‌కు చెందిన పూర్తి అనుబంధ సంస్థ ‘టాటా కమ్యూనికేషన్స్ పేమెంట్ సొల్యూషన్స్ (టీసీపీఎస్‌ఎల్)కు చెందిన...

హైదరాబాద్: టాటా కమ్యూనికేషన్స్‌కు చెందిన పూర్తి అనుబంధ సంస్థ ‘టాటా కమ్యూనికేషన్స్ పేమెంట్ సొల్యూషన్స్ (టీసీపీఎస్‌ఎల్)కు చెందిన ఇండీక్యాష్ ఏటీఎంల సంఖ్య తాజాగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 1,500ల మైలురాయికి చేరింది. ఏపీలోని గుంటూరు జిల్లాలోని పిడుగురాళ్ల మండలంలో ఉన్న ఏపీఎస్‌ఆర్‌టీసీ వద్ద ఈ 1,500వ ఏటీఎంను ఏర్పాటు చేసినట్లు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. చిన్న చిన్న పట్టణాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో ఏటీఎంల వినియోగాన్ని పెంచాలనే తమ లక్ష్యాన్ని తాజా మైలురాయి ప్రతిబింబిస్తోందని పేర్కొంది. కాగా కంపెనీకి దేశవ్యాప్తంగా 8,500 ఇండీక్యాష్ ఏటీఎంలు ఉన్నాయి. వచ్చే రెండేళ్లలో ఈ సంఖ్యను 15,000లకు తీసుకెళ్లాలని కంపెనీ భావిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement