టీసీఎస్‌ షేర్ల బైబ్యాక్‌కు ఓకే | TCS shareholders approve buyback | Sakshi
Sakshi News home page

టీసీఎస్‌ షేర్ల బైబ్యాక్‌కు ఓకే

Apr 18 2017 1:04 AM | Updated on Sep 5 2017 9:00 AM

టీసీఎస్‌ షేర్ల బైబ్యాక్‌కు ఓకే

టీసీఎస్‌ షేర్ల బైబ్యాక్‌కు ఓకే

టీసీఎస్‌ వాటాదారులు రూ.16,000 కోట్ల షేర్ల బైబ్యాక్‌ ఆఫర్‌కు ఆమోదం తెలిపారు. మొత్తం పోలైన ఓట్లలో 99.81% ఓట్లు షేర్ల బైబ్యాక్‌ ప్రతిపాదనకు అనుకూలంగా వచ్చినట్లు టీసీఎస్‌ పేర్కొంది.

ఒక్కో షేర్‌ బైబ్యాక్‌ ధర రూ.2,850  
మొత్తం బైబ్యాక్‌ విలువ రూ.16,000 కోట్లు   


న్యూఢిల్లీ: టీసీఎస్‌ వాటాదారులు రూ.16,000 కోట్ల షేర్ల బైబ్యాక్‌ ఆఫర్‌కు ఆమోదం తెలిపారు. మొత్తం పోలైన ఓట్లలో 99.81% ఓట్లు షేర్ల బైబ్యాక్‌ ప్రతిపాదనకు అనుకూలంగా వచ్చినట్లు టీసీఎస్‌ పేర్కొంది. ఈ బైబ్యాక్‌లో భాగంగా  చెల్లించిన ఈక్విటీ మూలధనంలో 2.85 శాతం వాటాకు సమానమైన 5.61  కోట్ల షేర్లను ఒక్కో షేర్‌ను రూ.2,850కు టీసీఎస్‌ కంపెనీ కొనుగోలు చేయనున్నది.

 షేర్ల బైబ్యాక్‌ ప్రతిపాదనకు కంపెనీ బోర్డ్‌ ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఆమోదం తెలిపింది. కాగా టీసీఎస్‌ కంపెనీ టెండర్‌ ఆఫర్‌ విధానంలో షేర్లను బైబ్యాక్‌ చేయనున్నది. మంగళవారంనాడు 2016–17 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక ఫలితాలను ఈ కంపెనీ వెల్లడించనున్న నేపథ్యంలో షేర్ల బైబ్యాక్‌కు వాటాదారుల ఆమోదం లభించడం విశేషం. ఈ బైబ్యాక్‌ విజయవంతమైతే భారత్‌లో ఇదే అతి పెద్ద బైబ్యాక్‌ కానున్నది. 2012లో జరిగిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ రూ.10,400 కోట్ల బైబ్యాక్‌.. ఇప్పటిదాకా అతి పెద్దది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement