వారానికి పాన్‌ కార్డు అప్లికేషన్స్‌ ఎన్నో తెలుసా?

Tax department receives 15-25 lakh PAN applications per week - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  ఆదాయ పన్ను శాఖకు  పాన్‌  కార్డ్‌ కోసం రోజుకు సగటున 15నుంచి 25లక్షల దరఖాస్తులు అందుతున్నాయని  ప్రభుత్వం  ప్రకటించింది.  అయితే కేవలం కొన్ని గంటలు  లేదా  రెండువారాల్లో పాన్‌ కార్డులను జారీ చేస్తున్నట్టు అయితే ప్రభుత్వం పార్లమెంటుకు తెలియజేసింది. పాన్‌కార్డు దరఖాస్తులను ప్రాసెస్ చేయడానికి , పాన్‌కార్డు  కేటాయింపు కోసం   కొన్ని గంటల నుండి రెండు వారాలు  సమయం పడుతోందని  ఆర్థిక శాఖ సహాయమంత్రి శివ్ ప్రతాప్ శుక్లా లోక్‌సభలో ఒక లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.

వారానికి సగటున 25లక్షల దాకా అప్లికేషన్స్‌  ఐటీ శాఖకు అందుతున్నాయని శుక్లా తెలిపారు.  జనవరి 28, 2018 నాటికి, మొత్తం 20,73,434 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. పాన్‌ కార్డు జారీకి రెండు సర్వీసు ప్రొడైవర్లు ఎన్‌ఎస్‌డిఎల్ ఇ-గోవ్ , యూటీఐఐటీఎస్ (NSDL e-Gov and UTIITS)  ఆదాయ పన్నుశాఖ కలిసి పనిచేస్తోందన్నారు. అలాగే పాన్‌ కార్డుతోపాటు ఇ పాన్‌ కార్డు ఒకేసారి జారీ చేస్తున్నామని వివరించారు. పాన్‌కార్డు జారీ ప్రక్రియ ఆలస్యమైనా,  నిబంధనలు ఉల్లంఘించినా భారీ జరిమానా విధించేలా సర్వీసు ప్రొవైడర్లతో  ఒప్పందం ఉన్నట్టు  స్పష్టం చేశారు.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top