టాటా సఫారి స్టార్మ్‌లో కొత్త వేరియంట్ | Tata Safari Storme Facelift Launched; Prices Start at Rs. 9.99 Lakh | Sakshi
Sakshi News home page

టాటా సఫారి స్టార్మ్‌లో కొత్త వేరియంట్

Jun 3 2015 12:38 AM | Updated on Sep 3 2017 3:07 AM

టాటా సఫారి స్టార్మ్‌లో కొత్త వేరియంట్

టాటా సఫారి స్టార్మ్‌లో కొత్త వేరియంట్

టాటా మోటార్స్ కంపెనీ తన స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ (ఎస్‌యూవీ) సఫారి స్టార్మ్‌లో అప్‌డేటెడ్ వేరియంట్‌ను మంగళవారం మార్కెట్లోకి తెచ్చింది.

ధరలు రూ.9.99 లక్షల నుంచి...
న్యూఢిల్లీ: టాటా మోటార్స్ కంపెనీ తన స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ (ఎస్‌యూవీ) సఫారి స్టార్మ్‌లో అప్‌డేటెడ్ వేరియంట్‌ను మంగళవారం మార్కెట్లోకి తెచ్చింది. ఈ కొత్త వేరియంట్ ధరలు రూ.9.99 లక్షల (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) నుంచి ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది. టాటా మోటార్స్ హొరైజన్ నెక్స్ట్‌వ్యూహాంలో భాగంగా ఈ కొత్త సఫారి స్టార్మ్‌ను అందిస్తున్నామని కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (ప్యాసింజర్ వెహికల్స్ బిజినెస్ యూనిట్) గిరీష్ వాఘ్ చెప్పారు.

ఈ కొత్త సఫారి స్టార్మ్‌లో ఎక్స్‌టీరియర్స్‌ను, ఇంటీరియర్స్‌ను కొత్తగా డిజైన్ చేశామని, మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్, డ్యుయల్ ఎయిర్-కండీషనింగ్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ డిస్ట్రిబ్యూషన్ వంటి ఫీచర్లున్నాయని వివరించారు. 1998లోనే సఫారి ఎస్‌యూవీని మార్కెట్లోకి తెచ్చామని, ఇప్పటివరకూ 1.2 లక్షల యూనిట్లను విక్రయించామని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement