సన్ టీవీకి రూ.233 కోట్ల లాభం | Sun TV Q1 net profit climbs 19% to Rs 233.1 cr | Sakshi
Sakshi News home page

సన్ టీవీకి రూ.233 కోట్ల లాభం

Aug 20 2016 1:06 AM | Updated on Sep 4 2017 9:58 AM

సన్ టీవీకి రూ.233 కోట్ల లాభం

సన్ టీవీకి రూ.233 కోట్ల లాభం

సన్ టీవీ నెట్‌వర్క్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలానికి రూ.233 కోట్ల నికర లాభం ఆర్జించింది.

న్యూఢిల్లీ: సన్ టీవీ నెట్‌వర్క్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలానికి రూ.233 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత క్యూ1లో సాధించిన నికర లాభం(రూ.233 కోట్లు) తో పోల్చితే 19 శాతం వృద్ధి సాధించామని సన్ టీవీ నెట్‌వర్క్ తెలిపింది. గత క్యూ1లో రూ.690 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ1లో 10 శాతం వృద్ధితో రూ.781 కోట్లకు ఎగసిందని పేర్కొంది. ఈ క్యూ1లో చందా ఆదాయం 22 శాతం వృద్ధితో రూ.232కోట్లకు చేరిందని వివరించింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో సన్ టీవీ నెట్‌వర్క్ షేర్ 0.4 శాతం క్షీణించి రూ.482 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ షేర్ ఏడాది గరిష్ట స్థాయి, రూ.491ను తాకింది.

Advertisement
 
Advertisement
Advertisement