బ్యాంకుల్లో వాటాలు విక్రయిస్తే సరిపోదు | State banks must revamp how employees are assessed: RBI deputy governor R Gandhi | Sakshi
Sakshi News home page

బ్యాంకుల్లో వాటాలు విక్రయిస్తే సరిపోదు

Jan 11 2015 2:48 AM | Updated on Sep 2 2017 7:30 PM

బ్యాంకుల్లో వాటాలు విక్రయిస్తే సరిపోదు

బ్యాంకుల్లో వాటాలు విక్రయిస్తే సరిపోదు

ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్‌బీ) బాసెల్ 3 మూలధన ప్రమాణాలు అందుకోవాలంటే కేంద్రం వాటిల్లో వాటాలు విక్రయిస్తే సరిపోదని రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ ఆర్.గాంధీ చెప్పా రు.

బాసెల్ 3 ప్రమాణాలపై ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ గాంధీ
కోల్‌కతా: ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్‌బీ) బాసెల్ 3 మూలధన ప్రమాణాలు అందుకోవాలంటే కేంద్రం వాటిల్లో వాటాలు విక్రయిస్తే సరిపోదని రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ ఆర్.గాంధీ చెప్పా రు. పీఎస్‌బీలు రాబోయే ఐదేళ్లలో నిధుల సమీకరణకు స్పష్టమైన ప్రణాళికను స్వయంగా సిద్ధం చేసుకోవాల్సి ఉంటుందని శనివారం జరిగిన ఒక సెమినార్‌లో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు.

పీఎస్‌బీలకు నిధులు సమకూర్చే క్రమంలో వాటిల్లో త న వాటాలను 52 శాతానికి తగ్గించుకోవాలని కేంద్రం యోచి స్తోన్న సంగతి తెలిసిందే. అయితే, కేంద్రం ఇలా వాటాలు తగ్గించుకోవడం ద్వారా నిధులు వచ్చినా అవి బాసెల్ 3 ప్రమాణాలు అందుకునేందుకు సరిపోవని గాంధీ పేర్కొన్నారు.

పీఎస్‌బీలు స్వయంగా నిధులు సమీకరించుకునేందుకు నాన్-ఓటింగ్ రైట్స్ షేర్ క్యాపిటల్, డిఫరెన్షియల్ ఓటింగ్ రైట్స్ క్యాపిటల్, గోల్డెన్ ఓటింగ్ రైట్స్ షేర్ క్యాపిటల్ మొదలైన అంశాలను పరిశీలించవచ్చని తెలిపారు. రెండో అంచె మూలధన అవసరాల కోసం బ్యాం కులు కావాలంటే దీర్ఘకాలిక బాండ్ల జారీ ద్వారా నిధులు సమకూర్చుకోవచ్చన్నారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement