శ్రీకాళహస్తి పైప్స్ లాభం రూ. 34 కోట్లు | Srikalahasti pipes profit of Rs. 34 crore | Sakshi
Sakshi News home page

శ్రీకాళహస్తి పైప్స్ లాభం రూ. 34 కోట్లు

Jul 30 2015 2:00 AM | Updated on Sep 3 2017 6:24 AM

శ్రీకాళహస్తి పైప్స్ (గతంలో ల్యాంకో ఇండస్ట్రీస్) తొలి త్రైమాసికంలో రూ. 34 కోట్ల నికర లాభాన్ని నమోదు

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : శ్రీకాళహస్తి పైప్స్ (గతంలో ల్యాంకో ఇండస్ట్రీస్) తొలి త్రైమాసికంలో రూ. 34 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. అంతకుముందు ఏడాది ఇదే కాలానికి కంపెనీ రూ. 13 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. సమీక్షా కాలంలో ఆదాయం రూ. 217 కోట్ల నుంచి రూ. 256 కోట్లకు పెరిగింది. తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులు, ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంతో రానున్న కాలంలో ఆదాయం గణనీయంగా పెరగుతుందన్న ధీమాను కంపెనీ వ్యక్తం చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement