ధర రూ.36 లక్షలు; ఆన్‌లైన్‌లోనే సేల్‌ | Skoda Octavia RS 245 Online Bookings To Open On March 1 | Sakshi
Sakshi News home page

స్కోడా ఆక్టేవియా ఆర్‌ఎస్‌ 245 లిమిటెడ్‌ వేరియంట్‌ 

Feb 28 2020 12:12 PM | Updated on Feb 28 2020 2:43 PM

Skoda Octavia RS 245 Online Bookings To Open On March 1 - Sakshi

స్కోడా ఆక్టేవియా ఆర్ఎస్ 245

సాక్షి, న్యూఢిల్లీ: స్కోడా ఆటో ఇండియా ఆక్టేవియా ఆర్‌ఎస్‌ 245 మోడల్‌లో లిమిటెడ్‌ ఎడిషన్‌ను మార్కెట్లోకి తెచ్చింది. ఈ కారు ధరను రూ.35.99 లక్షలు(ఎక్స్‌ షోరూమ్‌)గా నిర్ణయించామని కంపెనీ బ్రాండ్‌ డైరెక్టర్‌ జాక్‌ హోలిస్‌ తెలిపారు. ఈ కారుకు ఆన్‌లైన్‌ బుకింగ్‌లు వచ్చే నెల 1 నుంచి మొదలవుతాయని పేర్కొన్నారు. రూ. లక్ష చెల్లించి బుక్‌ చేసుకోవాలని, 200 కార్లను మాత్రమే అందుబాటులోకి తెచ్చామని వివరించారు. బుక్‌స్కోడాఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌ ద్వారా మాత్రమే అమ్మకాలు జరుపుతామని తెలిపారు.  ఈ కారును 2లీటర్ల పెట్రోల్‌ ఇంజిన్‌తో రూపొందించామని, ఏడు గేర్ల ఆటోమేటిక్‌ డ్యుయల్‌–క్లచ్‌ ట్రాన్సిమిషన్‌ వంటి ప్రత్యేకతలున్నాయని వివరించారు. ఈ కారు వంద కిలోమీటర్ల వేగాన్ని 6.6 సెకన్లలోనే అందుకుంటుందని, గరిష్ట వేగం గంటకు 250 కి.మీ. ర్యాలీ గ్రీన్, రేస్ బ్లూ, కొరిడా రెడ్, మ్యాజిక్ బ్లాక్ మరియు కాండీ వైట్ అనే ఐదు రంగుల్లో లభిస్తుంది.


 

Advertisement
 
Advertisement
Advertisement