టాటా గ్లోబల్‌ బెవరేజెస్‌ బోర్డులోకి మాజీ బ్యాంకర్‌

Shikha Sharma and Bharat Puri Appoined as Directors  in Tata Global Beverages  - Sakshi

సాక్షి, ముంబై : యాక్సిస్‌ బ్యాంకు మాజీ సీఎండీ శిఖాశర్మ  టాటా గ్లోబల్‌ బెవరేజెస్‌ బోర్డులో స్వత్రంత్ర, అదనపు  డైరెక్టర్‌గా నియమితులయ్యారు.  బ్యాంకింగ్‌ రంగంలో  మూడు దశాబ్దాలకు పైగా అనుభవమున్న శిఖా శర్మతోపాటు  పిడిలైట్‌  ఇండస్ట్రీస్‌ ఎండీ భరత్‌ పూరినీ కూడా బోర్డులోకి తీసుకున్నట్టు  సంస్థ మార్కెట్‌  ఫైలింగ్‌లో తెలిపింది. వీరి నియామకం  మే 7, 2019 నుంచి అమల్లోకి వచ్చిందని, అయిదేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారని టాటా గ్లోబల్‌ బేవరేజెస్‌   ప్రకటించింది.  దీనికి  రానున్న సాధారణ వార్షిక సమావేశంలో  వాటా దారుల అనుమతి తీసుకోవాల్సింది అని తెలిపింది. 

కాగా శిఖా  శర్మ 2004, జూన్‌  నుంచి డిసెంబరు 2018 వరకు యాక్సిస్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్,  సీఈఓగా వ్యవహరించారు. 1980లో  ఐసీఐసీఐ బ్యాంకులో కరీయర్‌ను ప్రారంభించిన  శర్మకు ఆర్థిక రంగంలో మూడు దశాబ్దాల అనుభవం ఉంది. 1982లో ఏసియన్‌ పెయింట్స్‌తో కరియర్‌ను ప్రారంభించిన భారత్‌ పూరి 2009 లో పిడిలైట్‌ ఇండస్ట్రీస్‌లో అదనపు డైరెక్టర్‌గా చేరారు.  అనంతరం  ఏప్రిల్, 2015 లో మేనేజింగ్ డైరెక్టర్ గా నియమితులయ్యారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top