ఒడిదుడుకులతో స్వల్ప లాభం! | Sakshi
Sakshi News home page

ఒడిదుడుకులతో స్వల్ప లాభం!

Published Tue, Sep 30 2014 3:59 PM

ఒడిదుడుకులతో స్వల్ప లాభం!

రిజర్వు బ్యాంక్ పరపతి సమీక్ష నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు ఒడిదుకులకు లోనయ్యాయి. సెన్సెక్స్ 26610 పాయింట్ల వద్ద ప్రారంభమై.. ఓ దశలో 26851 పాయింట్ల ఇంట్రాడే గరిష్ట స్థాయిని, 26481 పాయింట్ల కనిష్ట స్థాయిని నమోదు చేసుకున్నాయి. 
 
అలాగే మరో ప్రధాన సూచీ నిఫ్టీ 7948 వద్ద ఆరంభమై 8030-7923 పాయింట్ల వద్ద కదలాడాయి.  చివరకు సెన్సెక్స్ 33 పాయింట్ల లాభంతో 26630 వద్ద, నిఫ్టీ 6 పాయింట్ల 7964 వద్ద ముగిసాయి. 
 
జీఎంటర్ టైన్ మెంట్, బీపీసీఎల్, సన్ ఫార్మా, హెచ్ డీఎఫ్ సీ, బజాజ్ ఆటో కంపెనీలు రెండు శాతానికి పైగా లాభాల్ని నమోదు చేసుకున్నాయి. 
 
డిఎల్ఎఫ్ అత్యధికంగా 4.71 శాతం నష్టపోగా, భెల్, పరవ్ గ్రిడ్ కార్పోరేషన్, ఏసీసీ, జిందాల్ స్టీల్ కంపెనీలు 2 శాతానికి పైగా నష్టపోయాయి. 

Advertisement
Advertisement