
సాక్షి, ముంబై: గుజరాత్ ఎన్నికల ఫలితాలను ప్రతిబింబిస్తూ స్టాక్‌మార్కెట్లు కదులుతున్నాయి. ఆరంభంలో 700 పాయింట్లకుపైగా మార్కెట్లు తాజా ఫలితాల సరళి నేపథ్యంలో భారీ నష్టాల్లోంచి అనూహ్యంగా లాభాల్లోకి మళ్ళాయి. సెన్సెక్స్ 188పాయింట్లు ఎగిసి 33,651 వద్ద, నిఫ్టీ 62 పాయింట్ల లాభంతో వద్ద 10, 395 వద్ద కొనసాగుతుండడం విశేషం. బ్యాంక్ నిఫ్టీ కూడా ఇదే బాటలో భారీగా పుంచుకుంది. మెటల్, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్స్ లాభాల్లో ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, రియల్టీ నష్టాల్లో ఉన్నాయి.
ముఖ‍్యంగా వేదాంతా 3.5 శాతం జంప్‌చేసింది. అలాగే సిప్లా, గెయిల్, హిందాల్కో, అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, ఏషియన్ పెయింట్స్, డాక్టర్ రెడ్డీస్, ఎస్‌బీఐ ఉన్నాయి. ఐవోసీ, టెక్‌మహీంద్రా, సన్‌ఫార్మ, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్, పవర్‌గ్రిడ్, టెక్ మహీంద్రా, ఓఎన్‌జీసీ, బజాజ్ ఆటో, బీపీసీఎల్, హీరోమోటో, హెచ్‌డీఎఫ్‌సీ నష్టపోతున్నాయి. మరోవైపు ఫైనల్ ఫిగర్స్ వచ్చేంతవరకు కీలక సూచీల్లో తీవ్ర ఒడిదుడుకులు తప్పవని మార్కెట్ విశ్లేషకుల భావన.