లాభాల్లో కొనసాగుతున్న సెన్సెక్స్, నిఫ్టీ!
భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు మంగళవారం ట్రేడింగ్ లో లాభాలతో కొనసాగుతున్నాయి.
హైదరాబాద్: భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు మంగళవారం ట్రేడింగ్ లో లాభాలతో కొనసాగుతున్నాయి. ఆటో, మెటల్, కాపిటల్ గూడ్స్, బ్యాంకింగ్ రంగాల కంపెనీల షేర్లలో కొనుగోళ్లు జరగడంతో సూచీలు లాభాల్ని నమోదు చేసుకున్నాయి.
మధ్యాహ్నం సమయానికి సెన్సెక్స్ 112 పాయింట్ల లాభంతో 25526 వద్ద, నిఫ్టీ 24 పాయింట్ల వృద్దితో 7636 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.
సూచీ ఆధారిత కంపెనీ షేర్లలో హిండాల్కో అత్యధికంగా 6.67 శాతం, మారుతి సుజుకీ 4.43, టాటా మోటార్స్ 3.91, ఎం అండ్ ఎం 3.47, టాటా స్టీల్ 2.80 శాతం లాభాల్ని నమోదు చేసుకున్నాయి. ఏషియన్ పేయింట్స్, విప్రో, టీసీఎస్, సన్ ఫార్మా, ఇన్పోసిస్ కంపెనీలు నష్టాల్ని నమోదు చేసుకున్నాయి.