
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. ఆరంభ లాభాల నుంచి వెనక్కి తగ్గిన సెన్సెక్స్ ప్రస్తుతం 42 పాయింట్లు క్షీణించి 36,682 వద్ద వుంది. అయితే నిఫ్టీ 11 పాయింట్లు లాభంతో 10,855 వద్ద ట్రేడవుతోంది. మిడ్ సెషన్ నుంచి తీవ్ర ఒడిదుడుకుల ధోరణి కొనసాగుతోంది. తొలుత సెన్సెక్స్ 170 పాయింట్లు ఎగసిన సెన్సెక్స్ ఒకదశలో 150 పాయింట్లకు పైగా నఫ్టోయింది. మళ్లీ 100 పాయింట్లకు పైగా పుంజుకుంది. ప్రస్తుతం నష్టాల్లో ఉంది.
మెటల్, ఆటో, ఫార్మా లాభపడుతుండగా, రియల్టీ, బ్యాంక్ నిఫ్టీ నష్టపోతున్నాయి. టాటామోటార్స్, బీపీసీఎల్, ఓఎన్‌జీసీ, కోల్ ఇండియా, ఐవోసీ, ఎన్‌టీపీసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, డాక్టర్ రెడ్డీస్, బ్రిటానియా, గెయిల్ లాభపడుతున్నాయి. మరోవైపు హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, హెచ్‌యూఎల్, హెచ్‌సీఎల్ టెక్, కొటక్ బ్యాంక్, ఎస్‌బీఐ, ఏషియన్ పెయింట్స్, ఎయిర్‌టెల్, టెక్ మహీంద్రా, టీసీఎస్ నష్టపోతున్నాయి.