ఆర్‌బీఐ రివ్యూపై దృష్టి: వరుసగా రెండో రోజూ నష్టాలే | Sensex extends losses at open Nifty below 10,100; RBI decision eyed | Sakshi
Sakshi News home page

ఆర్‌బీఐ రివ్యూపై దృష్టి: వరుసగా రెండో రోజూ నష్టాలే

Dec 6 2017 9:42 AM | Updated on Dec 6 2017 9:43 AM

Sensex extends losses at open Nifty below 10,100; RBI decision eyed - Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ప్రారంభమైనాయి సెన్సెక్స్‌ 91, నిప్టీ 38 పాయింట్ల నష్టంతో ట్రేడింగ్‌ను కొనసాగిస్తోంది. తద్వారా నిఫ్టీ 10,100‍ స్థాయి దిగువకుచేరింది. ముఖ్యంగా ఆర్‌బీఐ పాలసీ నిర్ణయం వెలువడనున్న నేపథ్యంలో మార్కెట్లు ఒడుదొడుకులకు లోను కావవచ్చని నిపుణుల అభిప్రాయం. ఆర్‌బీఐ నిర్ణయం  మార్కెట్లను మార్గనిర్దేశనం చేయనుంది.  ఈ నేపథ్యంలో ట్రేడర్లు అమ్మకాలతో వరుసగా రెండో రోజు నష్టాలు కొనసాగుతున్నాయి.  దీంతో దాదాపు అన్ని సెక్టార్లు  బలహీనంగా ట్రేడ్‌ అవుతున్నాయి.  ముఖ్యంగా ప్రభుత్వ బ్యాంకులు, మెటల్‌ ఇండెక్స్‌ బాగా నష్టపోతున్నాయి. 

వేదాంతా, హిందాల్కో, టాటా స్టీల్‌, ఐషర్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, అదానీ పోర్ట్స్‌, యస్‌బ్యాంక్‌, విప్రో, హెచ్‌పీసీఎల్‌, ఎంఅండ్ఎం  నష్టాల్లోనూ,  హెచ్‌సీఎల్‌ టెక్, ఇన్ఫోసిస్‌, ఆర్‌ఐఎల్‌, సిప్లా  స్వల్ప లాభాల్లోనూ కొనసాగుతున్నాయి.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement