భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు మంగళవారం స్వల్పంగా నష్టాలతో ముగిసాయి
స్వల్ప నష్టాలతో ముగిసిన సెన్సెక్స్!
Oct 14 2014 4:26 PM | Updated on Sep 2 2017 2:50 PM
హైదరాబాద్: భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు మంగళవారం స్వల్పంగా నష్టాలతో ముగిసాయి. ప్రధాన సూచీలలో సెన్సెక్స్ 34 పాయింట్ల నష్టంతో 26349 పాయింట్ల వద్ద, నిఫ్టీ 20 పాయింట్లు క్షీణించి 7854 వద్ద ముగిసాయి.
సూచీ ఆధారిత కంపెనీ షేర్లలో భెల్, బజాజ్ ఆటో, యాక్సీస్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, టాటా పవర్ కంపెనీల షేర్లు 2 శాతానికి పైగా లాభాల్ని నమోదు చేసుకున్నాయి. డీఎల్ఎఫ్, బీపీసీఎల్, కెయిర్న్ ఇండియా, హెచ్ సీఎల్ టెక్, టాటా పవర్ కంపెనీలు నష్టాలతో ముగిసాయి.
Advertisement
Advertisement