65 కోట్లతో సాగర్ సిమెంట్స్ వేస్ట్ హీట్ రికవరీ ప్లాంట్ | Sagar Cements board nod for 6 MW waste heat recovery plant | Sakshi
Sakshi News home page

65 కోట్లతో సాగర్ సిమెంట్స్ వేస్ట్ హీట్ రికవరీ ప్లాంట్

Mar 12 2016 1:43 AM | Updated on Sep 3 2017 7:30 PM

65 కోట్లతో సాగర్ సిమెంట్స్ వేస్ట్ హీట్ రికవరీ ప్లాంట్

65 కోట్లతో సాగర్ సిమెంట్స్ వేస్ట్ హీట్ రికవరీ ప్లాంట్

సాగర్ సిమెంట్స్ రూ. 65.23 కోట్ల వ్యయంతో 6 మెగావాట్ల సామర్థ్యం గల వేస్ట్ హీట్ రికవరీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది.

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సాగర్ సిమెంట్స్ రూ. 65.23 కోట్ల వ్యయంతో 6 మెగావాట్ల సామర్థ్యం గల వేస్ట్ హీట్ రికవరీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. నల్లగొండ జిల్లా మట్టంపల్లిలో ఈ యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి శుక్రవారం సమావేశమైన బోర్డు ఆమోదముద్ర వేసింది. దీనికి కావాల్సిన నిధులను రుణాలు, అంతర్గత వనరుల ద్వారా సమకూర్చుకోనున్నట్లు కంపెనీ తెలిపింది. రూ. 10 ముఖ విలువ కలిగిన ప్రతీ షేరుకు 50 శాతం డివిడెండ్ (రూ. 5)ను ప్రకటిస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. దీనికి రికార్డు తేదీ మార్చి 23గా నిర్ణయించింది.

Advertisement
 
Advertisement
Advertisement