జీఎస్‌టీ ఎఫెక్ట్‌: రూపాయి బలహీనం

Rupee weakens to 65.36 against dollar - Sakshi

సాక్షి,ముంబై:  దేశీయ కరెన్సీ  రూపాయి విలువ సోమవారం భారీగా క్షీణించింది. జీఎస్‌టీ కౌన్సిల్‌  పన్ను రేట్లపై కేంద్రం తీసుకున్న నిర్ణయంతో   భారీ ఆర్థిక భారం పడనుందనే భయంతో  భారీగా అమ్మకాల  ఒత్తిడి నెలకొంది.  కౌన్సిల్  తాజా నిర్ణయంతో ఆర్థిక  వ్యవస్థపై సంవత్సరానికి  రూ .20వేల కోట్ల  భారనుంది. డాలర్‌ మారకరంలో 20 పైసలు క్షీణించి  రూ.65.36 కు చేరుకుంది.

మరో వైపు డాలర్‌ బలం కూడా రూపీ విలువ క్షీణతకు దాసింది. ఇతర కరెన్సీలకు వ్యతిరేకంగా డాలర్‌ బలం, విదేశీ ఫండ్ ప్రవాహాలు కూడా రూపాయిపై ఒత్తిడిని పెంచాయి. దిగుమతిదారులు,  బ్యాంకుల నుంచి అమెరికా కరెన్సీకి డిమాండ్ తో రూపాయి విలువ పతనం కారణమని డీలర్స్ భావిస్తున్నారు.

దీంతోపాటు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు  ఈక్విటీ మార్కెట్లనుంచి రూ.529 కోట్ల మేర పెట్టబడులును  శుక్రవారం ఉపసంహరించుకున్నారు. శుక్రవారం ముగింపులో రూపాయి  22పైసలు కోల్పోయి రూ.65.16వద్ద ముగిసింది.  మరోవైపు  దేశీయ స్టాక్‌మార్కెట్లు   నష్టాల్లో కొనసాగుతున్నాయి.
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top