మెడికల్‌ ఉత్పత్తుల అడ్డా ‘ఆర్కే’ 

Rk enterprises Agreement with multinational companies - Sakshi

ఏటా రూ.6 కోట్ల వ్యాపారం

ఈ ఏడాది లక్ష్యం రూ.20 కోట్లు

స్టార్టప్‌ డైరీతో ఫౌండర్‌ రవికిరణ్‌  

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: స్కానింగ్, ఈసీజీ వంటి వైద్య ఉత్పత్తులను సమీకరించుకోవటం కార్పొరేట్‌ ఆసుపత్రులకు పెద్ద కష్టమేమీ కాదు. కానీ, గ్రామాల్లోని ఆసుపత్రులకు కాస్త ఇబ్బందే. దీన్నే వ్యాపార వేదికగా ఎంచుకుంది ఆర్కే ఎంటర్‌ప్రైజెస్‌. బహుళ జాతి కంపెనీలతో ఒప్పందం   చేసుకొని ద్వితీయ శ్రేణి పట్టణాల్లో మెడికల్‌ ఉత్పత్తులను విక్రయించడమే దీని ప్రత్యేకత. మరిన్ని వివరాలు సంస్థ ఫౌండర్‌ రవి కిరణ్‌ ‘స్టార్టప్‌ డైరీ’తో పంచుకున్నారు. ‘‘మాది నెల్లూరు. బీ–ఫార్మసీ పూర్తయ్యాక.. విప్రో జీఈలో ఆంధ్రప్రదేశ్‌ బిజినెస్‌ మేనేజర్‌గా చేరా. తర్వాత శామ్‌సంగ్‌ మెడికల్‌ ఎక్విప్‌మెంట్‌లో సేల్స్‌ మేనేజర్‌గా పనిచేశా. అప్పుడు గమనించింది ఏంటంటే? గ్రామాల్లోని ఆసుపత్రుల్లో మెడికల్, డయాగ్నస్టిక్‌ ఉత్పత్తులు అందుబాటులో లేకపోవటంతో దగ్గర్లోని నగరాలకు వెళ్లాల్సి వస్తోంది. దీంతో వైద్య సేవలు ఆలస్యమవుతున్నాయని! దీనికి పరిష్కారం చూపించేందుకు 2017 డిసెంబర్‌లో నెల్లూరు కేంద్రంగా ఆర్కే ఎంటర్‌ప్రైజెస్‌ను ప్రారంభించాం. అందుబాటు ధరల్లో మెడికల్‌ ఉత్పత్తులు, మెడి కన్జ్యూమబుల్స్‌ని విక్రయించడం మా ప్రత్యేకత. 

40కి పైగా వైద్య ఉత్పత్తులు.. 
స్కానింగ్‌ మిషన్స్, ఈసీజీ, ఫెటల్‌ మానిటర్స్, కార్డియో కేర్‌ వంటి 40 రకాలకు పైగా వైద్య ఉత్పత్తులను విక్రయిస్తున్నాం. కేబుల్స్, ప్రింటర్స్, పేపర్స్‌    వంటి మెడి కన్జ్యూమబుల్స్‌ కూడా ఉంటాయి. ఉత్పత్తుల కోసం బయోనెట్, ఫెటల్, వాటెక్‌ ఇండియా,    డాల్ఫిన్, ఫిలిప్స్, క్రౌన్‌డెంట్, ఆట్రియం వంటి 12 కంపెనీలతో ఒప్పందం చేసుకున్నాం. త్వరలోనే సోనీ, సియామ్స్, సీమెన్స్‌తోనూ ఒప్పందం చేసుకోనున్నాం. 

నెలకు రూ.50 లక్షలు..
వైద్య ఉత్పత్తుల విక్రయంతో పాటూ ఇన్‌స్టలేషన్, సర్వీసింగ్‌ కూడా కంపెనీయే చూసుకుంటుంది. ప్రస్తుతం నెలకు రూ.50 లక్షల వ్యాపారం చేస్తున్నాం. ఇప్పటివరకు వందకు పైగా ఇన్‌స్టలేషన్‌ చేశాం. కర్నూల్, నెల్లూరులోని 6 సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులతో ఒప్పందం చేసుకున్నాం. ప్రస్తుతం మా సంస్థలో 14 మంది ఉద్యోగులున్నారు. మార్చి నాటికి ఆర్కేమెడిసాల్స్‌.కామ్‌ వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెస్తాం. ఈ ఏడాదిలో రూ.20 కోట్ల ఆదాయాన్ని లకి‡్ష్యంచాం. మెడికల్‌ ఉత్పత్తుల నిల్వ కోసం నెల్లూరులో గిడ్డంగి ఏర్పాటు చేశాం. రూ.5 లక్షల లోపు ధర ఉంటే వైద్య ఉత్పత్తులను నిల్వ చేస్తాం’’ అని రవి కిరణ్‌ తెలిపారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top