జియో మరో సంచలన సర్వీసులు

Reliance Jio Launches New JioLink Plans - Sakshi

రిలయన్స్‌ జియో మరో సంచలన సర్వీసులను కమర్షియల్‌గా లాంచ్‌ చేయబోతుంది. అవే జియోలింక్‌ సర్వీసులు. ప్రస్తుతం టెస్టింగ్‌ దశలో ఉన్న జియోలింక్‌ సర్వీసులపై బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. తన జియోలింక్‌ సబ్‌స్క్రైబర్ల కోసం మూడు కొత్త ప్లాన్లను లాంచ్‌ చేస్తున్నట్టు రిలయన్స్‌ జియో తెలిపింది. అవే 699 రూపాయలు, 2099 రూపాయలు. 4199 రూపాయల ప్యాకేజీలు. ఈ ప్యాకేజీలన్నింటిపై రోజుకు 5జీబీ డేటాను ఆఫర్‌ చేయనున్నట్టు రిలయన్స్‌ జియో తెలిపింది. ఈ ప్యాక్‌లపై ఎలాంటి కాలింగ్‌ ప్రయోజనాలు ఉండవు. 

తొలి ప్లాన్ కింద 699 రూపాయలపై 5జీబీ 4జీ డేటాను కంపెనీ అందిస్తోంది. ఈ ప్లాన్‌వాలిడిటీ 28 రోజులు. కేవలం 5 జీబీ డేటా మాత్రమే కాకుండా 16 జీబీ అదనపు డేటాను జియో ఆఫర్‌ చేస్తోంది. అంటే మొత్తంగా నెలకు 156 జీబీ డేటాను యూజర్లు పొందుతారు. ఇక రెండో ప్లాన్‌ కింద పైన పేర్కొన్న ప్రయోజనాలే 98 రోజుల పాటు అందనున్నాయి. రోజుకు 5 జీబీ డేటా, ఈ ప్లాన్‌పై అదనంగా 48 జీబీ డేటాను 4జీ స్పీడులో యూజర్లకు జియో ఆఫర్‌ చేయనుంది. దీంతో మొత్తంగా 98 రోజుల పాటు 538 జీబీ డేటాతో యూజర్లు పండుగ చేసుకోవచ్చు. 
 
సగం వార్షిక ప్రాతిపదికన మూడో ప్లాన్‌ను జియో ఆవిష్కరించింది. అది 4,199 రూపాయల ప్లాన్‌. ఈ ప్లాన్‌ 196 రోజుల పాటు అందుబాటులో ఉంటుంది.  ఈ ప్యాక్‌పై కూడా రోజుకు 5 జీబీ డేటాను, అదనంగా 96 జీబీ డేటాను యూజర్లు పొందవచ్చు. అంటే మొత్తంగా యూజర్లు 1076 జీబీ డేటాను పొందనున్నారు. ఈ మూడు ప్యాక్‌లపై జియో యాప్స్‌ కాంప్లిమెంటరీ సబ్ స్క్రిప్షన్‌ ను పొందవచ్చు. మంచి నెట్‌వర్క్‌ ఉండి కూడా సమస్యలు ఎదుర్కొనే వారికి జియోలింక్‌ సర్వీసులు ఎంతో ఉపయోగకరం. ప్రస్తుతం జియో లింక్‌ సర్వీసులు కమర్షియల్‌గా ఇంకా అందుబాటులోకి రాలేదు. ఇవి టెస్టింగ్‌ దశలో ఉన్నట్టు తెలిసింది. త్వరలోనే ఈ సర్వీసులను కూడా రిలయన్స్‌ జియో కమర్షియల్‌గా లాంచ్‌ చేయబోతుంది. జియోలింక్‌ డివైజ్‌ హాస్పాట్‌ డివైజ్‌ కంటే ఎక్కువ. వైర్డ్‌ కనెక్షన్‌లో ఎలాంటి పరిమితులు లేకుండా.. హై-స్పీడ్‌ ఇంటర్నెట్‌ యాక్సస్‌ను అందించడమే జియోలింక్‌ డివైజ్‌ ఉద్దేశం.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top