రిలయన్స్ జియోకి ఎంఎస్‌ఓ అనుమతి | Reliance Jio gets provisional registration as digital TV MSO | Sakshi
Sakshi News home page

రిలయన్స్ జియోకి ఎంఎస్‌ఓ అనుమతి

Jun 23 2015 1:03 AM | Updated on Sep 3 2017 4:11 AM

రిలయన్స్ జియోకి ఎంఎస్‌ఓ అనుమతి

రిలయన్స్ జియోకి ఎంఎస్‌ఓ అనుమతి

డిజిట ల్ కే బుల్ టీవీ విభాగంలో మల్టీ సర్వీస్ ఆపరేటర్‌గా (ఎంఎస్‌ఓ) వ్యవహరించడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ కంపెనీ రిలయన్స్ జియో మీడియా

న్యూఢిల్లీ: డిజిట ల్ కే బుల్ టీవీ విభాగంలో మల్టీ సర్వీస్ ఆపరేటర్‌గా (ఎంఎస్‌ఓ) వ్యవహరించడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ కంపెనీ రిలయన్స్ జియో మీడియా ప్రైవేట్ లిమిటెడ్‌కు కేంద్రం అనుమతినిచ్చింది. బ్రాడ్‌కాస్టర్ నుంచి వచ్చే ప్రోగ్రామింగ్ సర్వీసులను పలు లోకల్ కేబుల్ ఆపరేటర్ల (సబ్‌స్క్రైబర్స్)కు చేరవేయడమే ‘ఎంఎస్‌ఓ’ల ముఖ్య విధి. ఈ కేంద్ర అనుమతితో రిలయన్స్ జియో ఇక నుంచి ఐఎంసీఎల్, సిటీ కేబుల్ నెట్‌వర్క్, డెన్ నెట్‌వర్క్, హాత్‌వే వంటి వాటికి పోటీ ఇవ్వనుంది. నెట్‌వర్క్ 18, ఐబీఎన్ 7, సీఎన్‌బీసీ అవాజ్ వంటి మీడియా సంస్థలతోపాటు 14 ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఇంటిగ్రేటెడ్ బిజినెస్ కేబుల్ రూపంలో టెలికం, హైస్పీడ్ డాటా, డిజిటల్ కామర్స్, మీడియా, పేమెంట్ సర్వీసులను అందించే జియో బ్రాండ్‌ను రిలయన్స్ జియో అభివృద్ధి చేస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement