రిలయన్స్ క్యాపిటల్ అసెట్‌లో నిప్పన్ మరిన్ని పెట్టుబడులు | Reliance Capital gains 3%, Nippon Life ups stake in Rel AMC | Sakshi
Sakshi News home page

రిలయన్స్ క్యాపిటల్ అసెట్‌లో నిప్పన్ మరిన్ని పెట్టుబడులు

Oct 14 2015 12:17 AM | Updated on Sep 3 2017 10:54 AM

ఫండ్ సంస్థ రిలయన్స్ క్యాపిటల్ అసెట్ మేనేజ్‌మెంట్ (ఆర్‌కామ్)లో భాగస్వామ్య కంపెనీ నిప్పన్ లైఫ్ మరో 14 శాతం వాటాలు కొనుగోలు చేసింది.

న్యూఢిల్లీ: ఫండ్ సంస్థ రిలయన్స్ క్యాపిటల్ అసెట్ మేనేజ్‌మెంట్ (ఆర్‌కామ్)లో భాగస్వామ్య కంపెనీ నిప్పన్ లైఫ్ మరో 14 శాతం వాటాలు కొనుగోలు చేసింది. ఇందుకోసం రూ. 1,196 కోట్లు వెచ్చించింది. దీంతో ఆర్‌కామ్‌లో జపాన్‌కి చెందిన నిప్పన్ లైఫ్ వాటా 49 శాతానికి చేరింది. దేశీ మ్యూచువల్ ఫండ్ పరిశ్రమలో ఇది మరో భారీ విదేశీ పెట్టుబడి (ఎఫ్‌డీఐ) కావడం గమనార్హం. తాజా పెట్టుబడులతో ఆర్‌కామ్ విలువ దాదాపు రూ. 8,542 కోట్ల (సుమారు 1.3 బిలియన్ డాలర్లు) మేర ఉండనుంది. దేశీయంగా అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలకు ఇంత వరకూ ఇంత భారీ వేల్యుయేషన్ దక్కలేదని ఆర్‌కామ్ పేర్కొంది.

డీల్ అనంతరం సంస్థ పేరు రిలయన్స్ నిప్పన్ లైఫ్ అసెట్ మేనేజ్‌మెంట్‌గా మారుతుందని వివరించింది. రెండు కంపెనీల బోర్డులు డీల్‌ను ఆమోదించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement