షావోమి ఫ్యాన్స్‌కు వాలెంటైన్స్‌ డే కానుక | Redmi Note 5 launch on February 14 | Sakshi
Sakshi News home page

షావోమి ఫ్యాన్స్‌కు వాలెంటైన్స్‌ డే కానుక

Feb 13 2018 11:47 AM | Updated on Feb 13 2018 1:49 PM

Redmi Note 5 launch on February 14 - Sakshi

రెడ్‌మి నోట్‌ 5 లాంచ్‌ ఈవెంట్‌ (ప్రతీకాత్మక చిత్రం)

వాలెంటైన్స్‌ డే కానుకగా షావోమి ఫ్యాన్స్‌ ముందుకు ఓ కొత్త స్మార్ట్‌ఫోన్‌ రాబోతుంది. రెడ్‌మి నోట్‌ 5 ను షావోమి రేపు విడుదల చేయబోతుంది. ఇప్పటికే ఈ ఈవెంట్‌కు సంబంధించి ఆహ్వానాలను కూడా కంపెనీ పంపించేసింది. రేపు విడుదల కాబోతున్న స్మార్ట్‌ఫోన్‌ పేరు రెడ్‌మి నోట్‌ 5 అని షావోమి వెబ్‌సైట్‌ ధృవీకరించింది. తొలుత ఈ స్మార్ట్‌ఫోన్‌ ఎక్స్‌క్లూజివ్‌గా ఫ్లిప్‌కార్ట్‌లోనే విక్రయానికి రానుంది. రెడ్‌మి ఫోన్‌ లాంచ్‌ ఈవెంట్‌ గురించి, ఈ ఈ-కామర్స్‌ వెబ్‌సైట్‌ ఓ బ్యానర్‌ను లిస్టు చేసింది. మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమయ్యే ఈ రెడ్‌మి నోట్‌ 5 ఈవెంట్‌ను షావోమి లైవ్‌ స్ట్రీమ్‌ చేయనుంది. 

లైవ్‌స్ట్రీమ్‌ కోసం యూజర్లు తమ షావోమి అకౌంట్‌తో ఎం.కామ్‌ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రర్‌ అవ్వాలి. లేదా ఫేస్‌బుక్‌ అకౌంట్‌ ద్వారా కూడా వీక్షించవచ్చు. రెడ్‌మి నోట్‌ 5తో పాటు కంపెనీ తొలి టీవీని కూడా లాంచ్‌ చేస్తోందని తెలుస్తోంది. ఎంఐ టీవీ 4 పేరుతో దీన్ని మార్కెట్‌లోకి తీసుకొస్తోంది. షావోమి లాంచ్‌ చేస్తున్న ఈ టీవీ 49 అంగుళాలు, 55 అంగుళాలు లేదా 65 అంగుళాలు ఉండబోతుందని టాక్‌.

1
1/1

Advertisement
 
Advertisement
Advertisement