షావోమీ నుంచి  రెడ్‌మీ గో స్మార్ట్‌ఫోన్‌

Redmi Go India launch highlights: At Rs 4,499 - Sakshi

ధర రూ. 4,499 

న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్స్‌ తయారీ సంస్థ షావోమీ తాజాగా రెడ్‌మీ గో పేరిట భారత మార్కెట్లో కొత్త ఫోన్‌ ఆవిష్కరించింది. దీని ధర రూ. 4,499గా ఉంటుంది. 1 జీబీ ర్యామ్, ఆండ్రాయిడ్‌ ఓరియో (గో ఎడిషన్‌) ఆపరేటింగ్‌ సిస్టం, 5 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే, 8 ఎంపీ రియర్‌ కెమెరా, 5 ఎంపీ సెన్సార్, క్వాడ్‌–కోర్‌ క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 425 చిప్‌ మొదలైనవి ఇందులో ప్రత్యేకతలు. మరోవైపు, యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) ఆధారిత చెల్లింపులకు సంబంధించి ’మి’ పేమెంట్స్‌ యాప్‌ను కూడా షావోమీ ఆవిష్కరించింది.

పేమెంట్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌గా ఐసీఐసీఐ బ్యాంకు వ్యవహరిస్తుందని తెలిపింది. కేవలం యూపీఐకి మాత్రమే పరిమితం కాకుండా డెబిట్‌ కార్డులు, క్రెడిట్‌ కార్డులు, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా కూడా చెల్లింపులు జరిపేందుకు ఈ యాప్‌ ఉపయోగపడుతుంది. త్వరలోనే ‘మి’ యాప్‌స్టోర్‌లో అందుబాటులోకి వస్తుందని షావోమీ తెలిపింది. షావోమీ అటు తమిళనాడులో మరో ప్లాంటును ప్రారంభించింది. దీంతో భారత్‌లో తమ ప్లాంట్ల సంఖ్య 7కు చేరినట్లు కంపెనీ పేర్కొంది. ఫాక్స్‌కాన్, ఫ్లెక్స్, హైప్యాడ్‌ సంస్థల భాగస్వామ్యంతో వీటిని ఏర్పాటు చేసినట్లు వివరించింది.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top