అద్భుతమైన రియల్‌మి 3 ప్రొ వచ్చేసింది

Realme 3 Pro Launchede  in India Today - Sakshi

ఒప్పో  తన సబ్‌ బ్రాండ్‌ రియల్‌మి  ద్వారా  మరో  స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనుంది. రియల్‌ మి  3 ప్రో  ను ఇవాళ  (సోమవారం, ఏప్రిల్‌ 22) ఢిల్లీలో లాంచ్‌ చేసింది. రియల్‌ మి2 ప్రొకి కొనసాగింపుగా తీసుకొస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్‌ ధరను అంచనాలకు కనుగుణంగానే  రూ. 13,999గా  నిర్ణయించింది.  రెండు వేరియంట్లలో ఈ  స్మార్ట్‌ఫోన్‌నున లాంచ్‌ చేసింది. పబ్‌జీ లాంటి గేమింగ్‌, వూక్‌3.0 ఫ్లాష్‌ చార్జ్‌, అద్భుతమైన సోనీ  కెమెరాలు ప్రధాన ఫీచర్లుగా కంపెనీ పేర్కొంది. 29, ఏప్రిల్‌ నుంచి  ఫ్లిప్‌కార్ట్‌, రియల్‌మి. కామ్‌ ద్వారా  అందుబాటులో ఉండనుంది. అలాగే హెచ్‌డీఎఫ్‌సీ కార్డుల ద్వారా  వెయ్యిరూపాయల డిస్కౌంట్‌ లభ్యం.

రియల్‌ మి  3 ప్రో  ఫీచర్లు
6.30అంగుళాల డిస్‌స్లే
క్వాల్కం  స్నాప్‌డ్రాగన్‌ 710 ప్రాసెసర్‌
ఆండ్రాయిడ్‌ పై 9.0
4జీబీ/6జీబీ ర్యామ్‌, 64/128 జీబీస్టోరేజ్‌
25 ఎంపీ రియర్‌ కెమెరా విత్‌  అల్ట్రాహెచ్‌డీ మోడ్‌
16+5 ఎంపీ రియర్‌ కెమెరా
4045  ఎంఏహెచ్‌ బ్యాటరీ

4జీబీ ర్యామ్‌, 32 జీబీస్టోరేజ్‌ రూ.13999
6జీబీ ర్యామ్‌ 128 జీబీస్టోరేజ్‌ ధర రూ. 16,999
దీంతో పాటో రియల్‌మి సీ  స్మార్ట్‌ఫోన్‌ కూడా ఒప్పో లాంచ్‌ చేసింది. రూ. 5999 ధరలో ఇది లభ్యం.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top