జీసీఎక్స్‌ దివాలా పిటిషన్‌

RCom undersea cable biz GCX files for bankruptcy protection - Sakshi

అనిల్‌ అంబానీకి చెందిన మరో కంపెనీ దివాలా పిటిషన్‌ దాఖలు చేసింది. అనిల్ అంబానీ టెలికాం సంస్థ రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ కు చెందిన యూనిట్ దివాలా రక్షణ కోసం దాఖలు చేసింది.  ప్రపంచలోనే అతిపెద్ద అండర్‌ వాటర్‌ కేబుల్‌ నెట్‌వర్క్‌కు యజమాని జీసీఎక్స్‌ లిమిటెడ్‌ 350 మిలియన్‌ డాలర్లు విలువైన బాండ్ల  చెల్లింపులు చేయడంలో విఫలం అయింది. ఈ బాండ్లకు ఆగస్టు 1 మెచ్యూర్‌ తేదీగా ఉంది. మరోవైపు అంబానీ నియంత్రణలో ఉన్న అడాగ్‌కు చెందిన రిలయన్స్‌ నావెల్‌ ఇంజినీరింగ్‌ లిమిటెడ్‌ కూడా తీవ్రమైన నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతోంది. దీనికితోడు  బాండ్లకు చెల్లింపులు చేసేందుకు జీసీఎక్స్‌ చేసిన ప్రయత్నాలు మొత్తం విఫలం అయ్యాయి. దీంతో రుణాన్ని వాటాలుగా మార్చే అంశాన్ని కూడా పరిశీలించారు. చివరకు అదీ విఫలం కావడంతో డెలావర్‌ కోర్టులో దివాలాకు సంబంధించి చాప్టర్‌ 11 పిటిషన్‌ను దాఖలు  చేసింది. కాగా  అనిల్‌ అంబానీ అప్పుల సంక్షోభంలో కొ ట్టుమిట్టాడుతున్నసంగతి తెలిసిందే. ఆస్తుల విక్రయం ద్వారా 3.1బిలియన్‌ డాలర్లను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకొంది. 
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top