ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ ఆచార్య రాజీనామా

RBI Deputy Governor Viral Acharya Quits - Sakshi

ముంబై : ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ విరాల్‌ ఆచార్య తన పదవికి రాజీనామా చేశారు. ఆర్నెల్ల పదవీకాలం ఉన్నప్పటికీ ఆయన డిప్యూటీ గవర్నర్‌గా తప్పుకున్నారు. ఆర్థిక సరళీకరణ అనంతరం ఆర్‌బీఐలో డిప్యూటీ గవర్నర్‌గా పనిచేసిన వారిలో విరాల్‌ ఆచార్య అత్యంత పిన్నవయస్కుడు కావడం గమనార్హం. ఆర్‌బీఐకి స్వతంత్ర ప్రతిపత్తి అవసరమని గట్టిగా వాదించిన ఆచార్య 2017, జనవరి 23న కేంద్ర బ్యాంక్‌లో చేరారు.

కాగా తాను గతంలో పనిచేసిన న్యూయార్క్‌ యూనివర్సిటీలో అర్థశాస్త్రం బోధించేందుకు తిరిగి అమెరికా వెళ్లనున్నారు. ఆర్‌బీఐ గవర్నర్‌గా ఊర్జిత్‌ పటేల్‌ నిష్క్రమణ తర్వాత కేంద్ర బ్యాంక్‌లో ఆచార్య ఇమడలేకపోయారని చెబుతున్నారు. మరోవైపు ఆర్థిక వృద్ధి, ద్రవ్యోల్బణంపై గత రెండు ద్రవ్య విధాన సమీక్షల్లో ప్రస్తుత గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌తో విరాల్‌ ఆచార్య విభేదించారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top