గోద్రేజ్‌ చేతికి ఆర్కే స్టూడియోస్‌

Raj Kapoor  iconic RK Studios goes to Godrej Properties - Sakshi

బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత రాజ్‌ కపూర్‌కు చెందిన  ఐకానిక్‌ ఆర్కే స్టూడియోస్‌ను గోద్రేజ్‌ సంస్థ చేజిక్కించుకుంది. ఈ స్టూడియోస్ ను హస్తగతం చేసుకోవడానికి చాలా సంస్థలు పోటీపడినా చివరకు.. గోద్రెజ్ సంస్థ గత ఏడాది అక్టోబర్‌లోనే  రూ.190 కోట్ల రూపాయలకు చేజిక్కించుకుంది.  అయితే శుక్రవారం దీనికి సంబంధించి లావాదేవీలన్నీ పూర్తయ్యాయి.  ఆర్కే స్టూడియోస్‌ను తమ ఆస్తుల్లో భాగం చేసుకున్నందుకు ఆనందంగా ఉందంటూ గోద్రేజ్‌ తెలిపింది. దీనిపై గోద్రేజ్‌ ఎక్జిక్యూటివ్‌ చైర్మన్‌ ఫిరోజ్‌షా గోద్రేజ్‌  వ్యాఖ్యానిస్తూ చెంబూరు మౌలిక సదుపాయాల ప్రాంతంగా ఎంతో అభివృద్ధి చెందుతోంది. మా వ్యూహాలకు ఈ స్థలం సరిగ్గా సరిపోతుంది. ఆర్కే స్టూడియోస్‌ ఎంతో ప్రాచుర్యం చెందింది. దీనికి ఎలాంటి చెడ్డపేరు రాకుండా చూసుకుంటామని స్పష్టం చేశారు. 

2017లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఈ స్టూడియోస్‌లో భారీ ఎత్తున ఆస్తి నష్టం జరిగింది. మరమ్మతులు చేయించాలనుకున్నప్పటికీ దీన్ని అమ్మకానికి పెట్టినట్లు స్టూడియోస్‌ యాజమాన్యం అనూహ్యంగా ప్రకటించింది. స్టూడియోస్‌ను ముంబయిలోని చెంబూరులో 2.2ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు.జరుపుకొన్నాయి. 

కాగా సుమారు 70 సంవత్సరాల క్రితం ముంబైలోని చెంబూర్ ప్రాంతంలో 2.2 ఎకరాల్లో నిర్మితమైన ఆర్కే స్టూడియోస్ ను  బాలీవుడ్ ప్రముఖ నటుడు రాజ్‌ కపూర్ ఈ స్టుడియోస్ ను నిర్మించారు.  1970, 80ల నాటి కాలంలో ఎన్నో చిత్రాలు ఇక్కడ చిత్రీకరణ జరుపుకున్నాయి. ఆర్‌కు ఫిలింస్‌ బ్యానర్లో ఆవారా, మేరా నామ్ జోకర్, శ్రీ 420 వంటి సినిమాలు నిర్మితమయ్యాయి. రాజ్‌ కపూర్ మరణించిన తరువాత ఈ స్టూడియోస్ ను  ఆయనకుటుంబం దీని బాగోగులు చూస్తూ వచ్చింది. అయితే   దీనిని అమ్మేయాలని రిషి కపూర్ ఫ్యామిలీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. 
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top