
న్యూఢిల్లీ: రీఇన్సూరెన్స్ సంస్థ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (జీఐసీ) షేర్లు లిస్టింగ్ రోజున నష్టాలు చవిచూశాయి. ఇష్యూ ధర రూ. 912తో పోలిస్తే 4.5 శాతం క్షీణించి ఇన్వెస్టర్లను నిరాశపర్చాయి. బుధవారం బీఎస్‌ఈలో ఇష్యూ ధర కన్నా దాదాపు 7 శాతం తక్కువగా రూ. 850 వద్ద జీఐసీ షేర్లు లిస్ట్ అయ్యాయి.
ఆ తర్వాత ఒక దశలో 14.44 శాతం మేర పడిపోయి రూ. 780.25కి కూడా క్షీణించాయి. చివరికి 4.56 శాతం నష్టంతో రూ. 870.40 వద్ద ముగిశాయి. కంపెనీ వేల్యుయేషన్ రూ. 76,351 కోట్లుగా నిలిచింది. రూ.855–912 ధరల శ్రేణితో పబ్లిక్ ఇష్యూకి వచ్చిన జీఐసీ రూ.11,370 కోట్లు సమీకరించింది.