పోర్షే ‘మకాన్’ @77 లక్షలు! | Porsche Macan R4 Launched in India at Rs 76.8 Lakh | Sakshi
Sakshi News home page

పోర్షే ‘మకాన్’ @77 లక్షలు!

Nov 16 2016 12:26 AM | Updated on Sep 4 2017 8:10 PM

పోర్షే ‘మకాన్’ @77 లక్షలు!

పోర్షే ‘మకాన్’ @77 లక్షలు!

పోర్షే కార్లను లగ్జరీకి పర్యాయ పదంగా చెప్పుకోవచ్చు. జర్మనీకి చెందిన ఈ లగ్జరీ స్పోర్‌‌ట్స కార్ల తయారీ కంపెనీ తాజాగా తన కాంపాక్ట్ ఎస్‌యూవీ ‘మకాన్’లో ‘ఆర్ 4’...

మార్కెట్లోకి కొత్త వేరియంట్...

 ముంబై: పోర్షే కార్లను లగ్జరీకి పర్యాయ పదంగా చెప్పుకోవచ్చు. జర్మనీకి చెందిన ఈ లగ్జరీ స్పోర్‌‌ట్స కార్ల తయారీ కంపెనీ తాజాగా తన కాంపాక్ట్ ఎస్‌యూవీ ‘మకాన్’లో ‘ఆర్ 4’ అనే కొత్త వేరియంట్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. అందుబాటు ధరలో కంపెనీ నుంచి వస్తోన్న కొత్త కారుగా ఇది వినియోగదారులకు చేరువకానుంది. దీని ధర రూ.76.84 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్ ముంబై) ఉంది.

‘మకాన్ ఆర్4’లో 7 స్పీడ్ పీడీకే డ్యూయెల్ క్లచ్ ట్రాన్‌‌సమిషన్, 2 లీటర్ 4 సిలిండర్ టర్బోచార్జ్‌డ్ ఇంజిన్, కొత్త జనరేషన్ పోర్షే కమ్యూనికేషన్ మేనేజ్‌మెంట్, వినూత్నమైన ఇంటీరియర్ ఫీచర్లు, అదిరిపోయే ఎక్స్‌టీరియర్ డిజైన్ వంటి పలు ప్రత్యేకతలు ఉన్నాయని కంపెనీ పేర్కొంది. ఇది 0-100 కిలోమీటర్ల వేగాన్ని 6.7 సెకన్లలో అందుకుంటుందని తెలిపింది. కారు గరిష్ట వేగం గంటకు 229 కిలోమీటర్లుగా ఉంది. దేశంలోని పోర్షే డీలర్లు ఇప్పటికే రూ.10 లక్షల అడ్వాన్‌‌సతో ‘ఆర్ 4’ బుకింగ్‌‌సను ప్రారంభించారు. కాగా మకాన్ పోర్ట్‌ఫోలియోలో వస్తున్న నాల్గవ మోడల్ ఇది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement