దివాలీ ధమాకా : రూ.1 కే స్మార్ట్‌ఫోన్‌ | Poco F1 get for Rs. 1 | Sakshi
Sakshi News home page

దివాలీ ధమాకా : రూ.1 కే స్మార్ట్‌ఫోన్‌

Oct 22 2018 8:38 PM | Updated on Oct 23 2018 2:59 PM

Poco F1 get for Rs. 1 - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: మొబైల్‌ రంగంలో దూసుకెళ్తున్న చైనీస్‌ దిగ్గజం షావోమి సబ్‌బ్రాండ్‌ పోకో కింద  విడుదల చేసిన పోకో ఎఫ్‌1  స్మార్ట్‌ఫోన్‌పై బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది.  భారీ విక్రయాలతో  అదరగొట్టిన ఈ స్మార్ట్‌ఫోన్‌ ఇపుడు  కేవలం రూ.1 కే లభించనుంది. దివాలీ ఆఫర్‌గా అక్టోబర్‌ 23, 25 తేదీల్లో  ఈ సేల్‌ ప్రకటించింది. 6జీబీ ర్యామ్‌, 128జీబీ వేరియంట్‌  ధర 23, 999 లు.  తాజా సేల్‌లో  రేపు సాయంత్రం నాలుగు గంటలకు రూ.1కే ఈ స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. ఎంఐ.కాం ద్వారా   సాయంత్రం 4.గంటలకు (పరిమితి సమయం) ఈ సేల్‌ ఉంటుంది. దీంతోపాటు ఇతర షావోమి  స్మార్ట్‌ఫోన్లు,  స్మార్ట్‌టీవీలు అమ్మకాలపై క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్లను కూడా అందిస్తోంది.

పోకో  ఎఫ్‌ 1 ఫీచర్లు
6.18 అంగుళాల డిస్‌ప్లే
1080x2160  పిక్సెల్స్‌రిజల్యూషన్‌
స్నాప్‌డ్రాగన్ 845 ఎస్‌ఓసీ
20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా,
12+5 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా
4000ఎంఏహెచ్ బ్యాటరీ

‘దివాలీ విత్ ఎంఐ' సేల్‌ ఆఫర్లు : రెడ్‌మీ నోట్ 5 ప్రొ 4జీబీ ర్యామ్/64 జీబీ స్టోరేజీ వేరియంట్‌ ధరను రూ. 2వేలు  డిస్కౌంట్‌ అనంతరం రూ.12,999కు లభ్యం.
6జీబీ ర్యామ్/64 జీబీ వేరియంట్ ధర రూ.14,999
 రెడ్‌మీ వై2పై కూడా రూ.2వేలు తగ్గింపుతో రూ.12,999కే అందిస్తోంది.
ఎంఐ ఏ2ను రూ.14,999లకు విక్రయిస్తోంది.

వీటితోపాటు ఎంఐ లెడ్ టీవీ ఏ4 (43 అంగుళాలు) మోడల్‌ రూ.21,999కే ఈ స్పెషల్‌లో లభ్యం. పేటీఎం, అమెజాన్ పే ద్వారా పేమెంట్‌ చేస్తే మరికొంత డిస్కౌంట్‌ను కస‍్టమర్లు సొంతం చేసుకోవచ్చు. ఇంకా  బ్లూటూత్ స్పీకర్లు, పవర్ బ్యాంకులు, రౌటర్లు, బాడీ కాంపోజిషన్ స్కేల్, సెల్ఫీ స్టిక్‌, ఇయర్‌ఫోన్లపైనా భారీ ఆఫర్లు.

Advertisement
 
Advertisement
Advertisement