breaking news
diwali dhamaka offer
-
జియో దీపావళి ధమాకా ఆఫర్.. 90 రోజులు అన్లిమిటెడ్
దేశంలో అగ్రగామి టెలికం సంస్థ రిలయన్స్ జియో పరిమిత-కాల దీపావళి ధమాకా ఆఫర్లో భాగంగా రూ. 899 ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందిస్తోంది. మొత్తం 200GB డేటా, అపరిమిత కాల్స్, రూ. 3,350 వరకు విలువైన కొన్ని ప్రత్యేక ప్రయోజనాలను అందించే ఈ ప్లాన్ కస్టమర్లకు నవంబర్ 5 వరకు అందుబాటులో ఉంటుంది.ప్రయోజనాలు ఇవే..జియో రూ. 899 ప్లాన్ 90 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ప్రీపెయిడ్ ప్యాకేజీలో 2GB రోజువారీ డేటాతో పాటు 20GB అదనపు డేటాతో మొత్తం 200GB హై-స్పీడ్ ఇంటర్నెట్ లభిస్తుంది. అలాగే రోజుకు 100 SMS, అపరిమిత కాలింగ్‌ను కూడా కవర్ చేస్తుంది. మీది 5G ఫోన్ అయితే, మీ ప్రాంతంలో 5G నెట్వర్క్ అందుబాటులో ఉంటే ఉచిత అపరిమిత 5Gని కూడా పొందవచ్చు.ఇదీ చదవండి: బీఎస్ఎన్ఎల్ కొత్త రీఛార్జ్ ప్లాన్.. ఏడాదంతా అదిరిపోయే ప్రయోజనాలు!అదనపు బెనిఫిట్స్ అజియోలో రూ. 999 లేదా అంతకంటే ఎక్కువ ఖర్చు చేసే కస్టమర్లకు ఫ్లాట్ రూ. 200 తగ్గింపు లభిస్తుంది. ఈజీట్రిప్ ద్వారా చేసిన విమానాలు, హోటల్ బుకింగ్ చేస్తే రూ. 3,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. స్విగ్గిలో రూ. 399 లేదా అంతకంటే ఎక్కువ ఆర్డర్ చేసినప్పుడు రూ. 150 ఆదా చేయవచ్చు. -
దీపావళి ఆఫర్: రూ. 699కే జియో 4జీ ఫోన్
రిలయన్స్ జియో.. జియో భారత్ దీపావళి ధమాకా ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ కింద 999 రూపాయల వద్ద లభిస్తున్న 4జీ ఫోన్లను కేవలం రూ. 699లకు అందిస్తోంది. ఈ అవకాశం కేవలం కొన్ని రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది. 2జీ ఫీచర్ ఫోన్స్ నుంచి అప్‌గ్రేడ్ అవ్వాలనుకునే వారికి ఇదొక గొప్ప అవకాశం.రూ.123 నెలవారీ సబ్స్క్రిప్షన్ & ప్రయోజనాలుపండుగ సీజన్ ఆఫర్ జియో భారత్ ప్లాన్‌తో వినియోగదారులు రూ. 123 నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌ని ఆస్వాదించవచ్చు. ⋆అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్⋆నెలకు 14 జీబీ డేటా⋆455 కంటే ఎక్కువ లైవ్ టీవీ ఛానెల్‌లు⋆సినిమా ప్రీమియర్లు & కొత్త సినిమాలు⋆వీడియో షోలు⋆లైవ్ స్పోర్ట్స్⋆జియో సినిమాలో హైలెట్స్⋆క్యూఆర్ కోడ్ స్కాన్లతో కూడా డిజిటల్ ట్రాన్సక్షన్⋆జియోపే ద్వారా అందుకున్న చెల్లింపులకు సౌండ్ అలర్ట్‌లను స్వీకరించడం⋆గ్రూప్ చాట్లు⋆జియో చాట్‌లో వీడియోలు, ఫోటోలు, మెసేజింగ్ వంటివి షేర్ చేయడంఇతర ఆపరేటర్లు అందిస్తున్న అతి తక్కువ ఫీచర్ ఫోన్ ప్లాన్‌తో (నెలకు రూ. 199) పోలిస్తే.. జియో భారత్ ప్లాన్ (నెలకు రూ. 123) దాదాపు 40 శాతం చౌకగా ఉంటుంది. దీంతో యూజర్ ప్రతినెలా రూ. 76 ఆదా చేయవచ్చు. ఇలా ఆదా చేస్తే మీరు తొమ్మిది నెలల్లో ఫోన్ కొన్న డబ్బును తిరిగి పొందినట్లే అవుతుంది. ఇది కేవలం ఫోన్ కంటే కూడా మీకు ఇష్టమైనవారికి ఇచ్చే గిఫ్ట్‌గా కూడా పనికొస్తుంది. దీనిని జియోమార్ట్ లేదా అమెజాన్ వంటి వాటిలో కొనుగోలు చేయవచ్చు. -
దివాలీ ధమాకా : రూ.1 కే స్మార్ట్‌ఫోన్
సాక్షి, న్యూఢిల్లీ: మొబైల్ రంగంలో దూసుకెళ్తున్న చైనీస్ దిగ్గజం షావోమి సబ్‌బ్రాండ్ పోకో కింద విడుదల చేసిన పోకో ఎఫ్1 స్మార్ట్‌ఫోన్‌పై బంపర్ ఆఫర్ ప్రకటించింది. భారీ విక్రయాలతో అదరగొట్టిన ఈ స్మార్ట్‌ఫోన్ ఇపుడు కేవలం రూ.1 కే లభించనుంది. దివాలీ ఆఫర్‌గా అక్టోబర్ 23, 25 తేదీల్లో ఈ సేల్ ప్రకటించింది. 6జీబీ ర్యామ్, 128జీబీ వేరియంట్ ధర 23, 999 లు. తాజా సేల్‌లో రేపు సాయంత్రం నాలుగు గంటలకు రూ.1కే ఈ స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. ఎంఐ.కాం ద్వారా సాయంత్రం 4.గంటలకు (పరిమితి సమయం) ఈ సేల్ ఉంటుంది. దీంతోపాటు ఇతర షావోమి స్మార్ట్ఫోన్లు, స్మార్ట్‌టీవీలు అమ్మకాలపై క్యాష్ బ్యాక్ ఆఫర్లను కూడా అందిస్తోంది. పోకో ఎఫ్ 1 ఫీచర్లు 6.18 అంగుళాల డిస్ప్లే 1080x2160 పిక్సెల్స్‌రిజల్యూషన్ స్నాప్‌డ్రాగన్ 845 ఎస్ఓసీ 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 12+5 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా 4000ఎంఏహెచ్ బ్యాటరీ ‘దివాలీ విత్ ఎంఐ' సేల్ ఆఫర్లు : రెడ్మీ నోట్ 5 ప్రొ 4జీబీ ర్యామ్/64 జీబీ స్టోరేజీ వేరియంట్ ధరను రూ. 2వేలు డిస్కౌంట్ అనంతరం రూ.12,999కు లభ్యం. 6జీబీ ర్యామ్/64 జీబీ వేరియంట్ ధర రూ.14,999 రెడ్మీ వై2పై కూడా రూ.2వేలు తగ్గింపుతో రూ.12,999కే అందిస్తోంది. ఎంఐ ఏ2ను రూ.14,999లకు విక్రయిస్తోంది. వీటితోపాటు ఎంఐ లెడ్ టీవీ ఏ4 (43 అంగుళాలు) మోడల్ రూ.21,999కే ఈ స్పెషల్‌లో లభ్యం. పేటీఎం, అమెజాన్ పే ద్వారా పేమెంట్ చేస్తే మరికొంత డిస్కౌంట్‌ను కస్టమర్లు సొంతం చేసుకోవచ్చు. ఇంకా బ్లూటూత్ స్పీకర్లు, పవర్ బ్యాంకులు, రౌటర్లు, బాడీ కాంపోజిషన్ స్కేల్, సెల్ఫీ స్టిక్, ఇయర్ఫోన్లపైనా భారీ ఆఫర్లు. Get #POCOF1 at Re 1/- Can't believe it? 🤔 Visit this link at 4 PM tomorrow: https://t.co/KEXfqNitL7 (Bookmark it!) RT and stand a chance to win exclusive POCO merchandise. 🔥 pic.twitter.com/Ojmqc3hnay — POCO India (@IndiaPOCO) October 22, 2018 -
స్పైస్ జెట్ దీపావళి ధమాకా ఆఫర్
దీపావళి సీజన్ దగ్గర పడటంతో.. స్పైస్ జెట్ విమానయాన సంస్థ ఓ సరికొత్త ఆఫర్ ప్రకటించింది. చవక ధరలకు 3 లక్షల టికెట్లను అమ్మకానికి పెట్టింది. స్వదేశీ ప్రయాణాలకు అయితే రూ. 749 నుంచి (పన్నులు కాకుండా), విదేశాలకు అయితే రూ. 3,999 నుంచి టికెట్ల ధరలున్నాయి. అయితే, ఇది పరిమిత కాల ఆఫర్. ముందుగా వచ్చినవాళ్లకే టికెట్లు ఉంటాయని చెప్పారు. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి నుంచి తొమ్మిది నెలల్లోగా ఈ ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. దీనికి అన్ని వర్గాల ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తుందని ఆశిస్తున్నట్లు స్పైస్ జెట్ ప్రతినిధి ఒకరు తెలిపారు. ముందుగా తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకునేవారికి ఇది చాలా సౌఖ్యంగా ఉంటుందని అన్నారు. మంగళవారం నుంచి అక్టోబర్ 29 వరకు ఈ చవక టికెట్లు అందుబాటులో ఉంటాయి. ఈ ఆఫర్ కింద ఢిల్లీ నుంచి అమృతసర్, అహ్మదాబాద్, ముంబై నగరాలకు వెళ్లేందుకు రూ. 749 బేస్ ఫేర్‌తో టికెట్లు అందుబాటులో ఉన్నాయి.