వడ్డీరేట్లు తగ్గించిన పీఎన్‌బీ

PNB cuts repo-linked lending rate by 40 bps to 6.65pc  - Sakshi

సాక్షి, ముంబై: దేశంలో రెండవ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బి) తన ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. రుణాల వడ్డీరేటును తగ్గిస్తూ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. అన్ని కాల పరిమితి గల రుణాలపై ఎంసీఎల్‌ఆర్‌ను 15 బీపీఎస్‌పాయింట్లు తగ్గించింది.

అలాగే రెపో-లింక్డ్ లెండింగ్ రేటు (ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్) ను 40 బేసిస్ పాయింట్లు (బిపిఎస్) తగ్గించింది. దీంతో 7.05 నుంచి 6.65 శాతానికి తిగి వచ్చింది. ఈ సవరించిన రేట్లు జూలై 1 నుంచి అమలులోకి వస్తాయని బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది ఫండ్ డిపాజిట్ రేటును కూడా తగ్గించింది. గరిష్టంగా 3.25 శాతం చెల్లించనున్నట్టు తెలిపింది. వివిధ మెచ్యూరిటీల టర్మ్ డిపాజిట్ రేట్లను గరిష్టంగా 5.50 శాతంగా ఉంచింది. రూ .2 కోట్లకు పైన డిపాజిట్లపై సీనియర్ సిటిజనులకు సాధరణ వాటికంటే కంటే 75 బీపీఎస్ పాయింట్ల మేర అధిక వడ్డీ రేటును అందివ్వనుంది.  ఇటీవల ఆర్‌బీఐ కీలక వడ్డీరేట్లను తగ్గించిన నేపథ్యంలో దీనికనుగుణంగా దేశీయ బ్యాంకులు కూడా వడ్డీరేట్లను సవరిస్తున్న సంగతి తెలిసిందే.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top