పెన్నా సిమెంట్స్‌ ఐపీఓ త్వరలో | Penna Cement files ₹1550 crore IPO papers with SEBI | Sakshi
Sakshi News home page

పెన్నా సిమెంట్స్‌ ఐపీఓ త్వరలో

Nov 6 2018 1:45 AM | Updated on Nov 6 2018 1:45 AM

Penna Cement files ₹1550 crore IPO papers with SEBI - Sakshi

న్యూఢిల్లీ: హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న  పెన్నా సిమెంట్స్‌ సంస్థ త్వరలో ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌కు (ఐపీఓ) రానుంది. ఈ కంపెనీ ఐపీఓ సంబంధిత పత్రాలను మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీకి సమర్పించింది. ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.1,550 కోట్లు సమీకరించనుంది. ఐపీఓలో భాగంగా రూ.1,300 కోట్ల విలువైన తాజా షేర్లను జారీ చేయటంతో పాటు ఆఫర్‌ ఫర్‌ సేల్‌లో (ఓఎఫ్‌ఎస్‌) భాగంగా కంపెనీ ప్రమోటర్‌ పీఆర్‌ సిమెంట్‌ హోల్డింగ్స్‌ రూ.250 కోట్ల షేర్లను విక్రయించనుంది.

ఈ ఐపీఓ నిధులను రుణ భారం తగ్గించుకోవడానికి, సాధారణ వ్యాపార కార్యకలాపాలకు వినియోగించుకోవాలని కంపెనీ యోచిస్తోంది. ఈ ఐపీఓకు లీడ్‌ మేనేజర్లుగా ఎడిల్‌వేజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్, ఐఐఎఫ్‌ఎల్‌ హోల్డింగ్స్, జేఎం ఫైనాన్షియల్, యస్‌ సెక్యూరిటీస్‌ వ్యవహరిస్తున్నాయి. దక్షిణ భారత దేశంలో ప్రముఖ సిమెంట్‌ కంపెనీల్లో పెన్నా సిమెంట్‌ ఒకటి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల్లో నాలుగు సిమెంట్‌ తయారీ ప్లాంట్లు, రెండు గ్రైండింగ్‌ యూనిట్లు ఉన్నాయి. ఏడాదికి ఈ కంపెనీ 10 మిలియన్‌ టన్నుల సిమెంట్‌ను ఉత్పత్తి చేస్తోంది. కాగా గత నెలలోనే ఇమామి సిమెంట్స్‌ సంస్థ రూ.1,000 కోట్ల సమీకరణ కోసం ఐపీఓకు అనుమతివ్వాలంటూ సెబీకి దరఖాస్తు చేసింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement