ఓలా సీఎఫ్‌వోగా ‘ఇన్ఫీ’ రాజీవ్ బన్సల్ | Ola Ropes In Former Infosys CFO Rajiv Bansal to Head Finance | Sakshi
Sakshi News home page

ఓలా సీఎఫ్‌వోగా ‘ఇన్ఫీ’ రాజీవ్ బన్సల్

Nov 27 2015 1:05 AM | Updated on Sep 3 2017 1:04 PM

ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మాజీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ రాజీవ్ బన్సల్‌ను తాజాగా ట్యాక్సీ సర్వీసుల సంస్థ ఓలా సీఎఫ్‌వోగా

న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మాజీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ రాజీవ్ బన్సల్‌ను తాజాగా ట్యాక్సీ సర్వీసుల సంస్థ ఓలా సీఎఫ్‌వోగా నియమితులయ్యారు. వచ్చే ఏడాది జనవరిలో ఆయన విధుల్లో చేరతారు. రాజీవ్ బన్సల్ అక్టోబర్‌లో ఇన్ఫీకి రాజీనామా చేశారు. ఆర్థిక రంగంలో ఆయనకి ఉన్న సుదీర్ఘ అనుభవం తమకు తోడ్పడగలదని ఓలా సహ వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ తెలిపారు. రాజీవ్‌కు ర్థిక రంగంలో 21 ఏళ్ల అనుభవం ఉంది. ఇన్ఫీలో 16 ఏళ్లుగా పనిచేశారు. అంతకు ముందు టాటా టెక్నాలజీస్, కేబుల్ అండ్ వైర్‌లెస్, ఏబీబీ తదితర సంస్థల్లో పనిచేశారు. ఇన్ఫోసిస్‌లో అత్యధిక వేతనం అందుకున్న ఉద్యోగుల్లో ఆయన కూడా ఒకరు. మార్చి 2015తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఆయన 7,70,858 డాలర్ల ప్యాకేజీ పొందారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement