మాల్యా ‘కింగ్‌ఫిషర్‌’ అవుట్‌ 

NSE To Delist Kingfisher Airlines, 17 Other Companies On 30 May - Sakshi

ముంబై : బ్యాంకులకు వేలకోట్ల రూపాయలు ఎగనామం పెట్టి విదేశాలకు పారిపోయిన విజయ్‌మాల్యాకు చెందిన కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌పై నేషనల్‌ స్టాక్‌ ఎక్స్చేంజీ వేటు వేసింది. ఆ కంపెనీని డీలిస్ట్‌ చేయాలని ఎన్‌ఎస్‌ఈ నిర్ణయించింది. కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌తో పాటు 17 సంస్థలను మే 30 నుంచి డీలిస్ట్‌ చేయబోతున్నట్టు ఎన్‌ఎస్‌ఈ ప్రకటించింది. ఇంతకు ముందే బీఎస్‌ఈ 200 కంపెనీలను డీలిస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఆరు నెలల పాటు వీటిని సస్పెండ్‌ చేస్తున్నట్టు తెలిపింది.

అక్రమంగా నిధులు తరలిస్తున్న షెల్‌ కంపెనీలు, మోసపూరిత కంపెనీలను జాబితా నుంచి తొలగించాలనుకున్న నేపథ్యంలోనే కింగ్‌ఫిషర్‌పైనా వేటు వేస్తున్నట్టు తెలిసింది. 331 అనుమానిత షెల్‌ కంపెనీలపై చర్యలు తీసుకోవాలని ఆగస్టులోని మార్కెట్‌ రెగ్యులేటర్‌ సెబీ స్టాక్‌ ఎక్స్ఛేంజీలను ఆదేశించింది. సుదీర్ఘకాలంగా ఎలాంటి వ్యాపార లావాదేవీలు నడవని 2 లక్షల షెల్‌ కంపెనీలపైనా కేంద్ర ప్రభుత్వం నిషేధించిన సంగతి తెలిసిందే.

నేడు ఎన్‌ఎస్‌ఈ చేస్తున్నట్టు ప్రకటించిన కంపెనీల్లో కింగ్‌షిఫర్‌తో పాటు  ప్లెథికో, ఆగ్రో డచ్‌ ఇండస్ట్రీస్‌, బ్రాడ్‌కాస్ట్‌ ఇన్షియేటివ్స్‌‌, క్రెస్ట్‌ యానిమేషన్‌ స్టూడియోస్‌, కేడీఎల్‌ బయోటెక్‌, కెమ్‌రాక్‌ ఇండస్ట్రీస్‌ అండ్‌ ఎక్స్‌పోర్ట్స్‌, లూమ్యాక్స్‌ ఆటోమోటివ్ సిస్టమ్స్‌‌, నిస్సాన్‌ కాపర్‌, శ్రీ ఆస్టర్‌ సిలికేట్స్‌, సూర్య ఫార్మాస్యూటికల్స్‌ తదితర కంపెనీలు ఉన్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top