ఆర్‌బీఐ దెబ్బ: మార్కెట్ల పతనం

Nifty slips below 9000-mark as RBI cuts repo rate - Sakshi

9 వేల దిగువకు నిఫ్టీ

మార్కెట్లకు రుచించని ఆర్‌బీఐ  రేటుకోత

సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ముఖ్యంగా మార్కెట్‌ అంచనాలకు అనుగుణంగా ఆర్‌బీఐ నిర్ణయాలు లేకపోవడంతో భారీ నష్టాల్లో ట్రేడవుతోన్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్‌ , ఫైనాన్సియల​ స్టాక్స్‌ భారీ అమ్మకాల ఒత్తిడికి లోనవుతోన్నాయి. బ్యాంక్‌ నిఫ్టీ దాదాపు 600 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది.సెన్సెక్స్‌ 380 పాయింట్ల నష్టంతో 30552 వద్ద, నిఫ్టీ 107 పాయింట్లు కోల్పోయి 8999 వద్ద కొనసాగుతున్నాయి. తద్వారా నిఫ్టీ మళ్ళీ  కీలక 9వేల దిగువకు పడిపోయింది. ఐటీ మినహా అన్ని రంగాల సూచీలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.

యాక్సిస్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌  నష్టపోతున్నాయి. మరోవైపు  ఇన్ఫోసిస్‌ , జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఏషియన్‌ పెయింట్స్‌ , భారతీ ఎయిర్‌టెల్‌, బ్రిటానియా  లాభాల్లో ఉన్నాయి

యూఎస్‌-చైనాల మధ్య మళ్ళీ ఉద్రికత్తలు. గ్లోబల్‌ మార్కెట్ల సంకేతాలతో అటు రూపాయి మారకం విలువ భారీగా క్షీణించింది,  డాలరుతోపోలిస్తే  రూపాయి 30 పైసలు నష్టంతో 75.91 వద్దకు చేరింది.

 కాగా కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌​ కారణంగా మందగించిన ఆర్థిక వ్యవస్థను ఆదుకునేందుకు  రిజర్వ్‌ బ్యాంక్‌ రెపో రేటులో 0.4 శాతం కోత పెట్టిన సంగతి తెలిసిందే.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top