అంతర్జాతీయంగా వస్తున్న బలహీన సంకేతాలతో మార్కెట్లో ఇన్వెస్టర్లు ఆచితూచి అడుగులు వేస్తున్నారు.
ముంబై: అంతర్జాతీయంగా వస్తున్న బలహీన సంకేతాలతో మార్కెట్లో ఇన్వెస్టర్లు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. సోమవారం పతనాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు, నేడు(మంగళవారం) కూడా అదే ట్రెండ్ ను కొనసాగించాయి. సెన్సెక్స్ 36 పాయింట్ల నష్టతో 25642.54 దగ్గర, నిఫ్టీ 5.25 పాయింట్ల నష్టంతో 7,849.80 పాయింట్లను వద్ద ట్రేడ్ అవుతోంది
హిందాల్కో, టాటాస్టీల్, మహింద్రా అండ్ మహింద్రా, బీహెచ్ఈఎల్, ఎన్టీపీసీ షేర్లు లాభాలను పండిస్తుండగా, ఐసీఐసీఐ బ్యాంకు, అదానీ పోర్ట్స్, హీరో, బజాజ్ ఆటో, ఎస్బీఐ నష్టాలను చవిచూస్తున్నాయి. ఈ వారం పెట్రోలియం స్టేటస్ రిపోర్టు(స్టాక్ ఫైల్స్ డేటా)ను యూఎస్, రేపు(బుధవారం) విడుదల చేయనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు షేర్ల కొనుగోలులో తొణికిసలాడుతున్నట్టు మార్కెట్ నిపుణులంటున్నారు.
అదేవిధంగా రేపు ఫెడరల్ రిజర్వు బ్యాంకు పాలసీ మీటింగ్ కూడా నిర్వహిస్తుండటం, కొత్తగా ఫెడ్ ఎలాంటి చర్యలను ప్రవేశపెట్టదని సంకేతాలు వస్తున్నాయి. కానీ మానిటరీ పాలసీపై ముందస్తు మార్గదర్శకాలు, భవిష్యత్ లో వడ్డీరేట్లు పెరుగుతాయనే సూచనలను ఫెడ్ ప్రకటిస్తుందని డీలర్లు ఆశిస్తున్నారు. మరోవైపు టుబాకో షేర్లు భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. టుబాకో రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిషేధించడంతో, మంగళవారం ట్రేడింగ్ లో గాడ్ఫ్రే ఫిలిప్స్ దాదాపు 17శాతం మేర పడిపోయింది.