మార్కెట్లోకి కొత్త ‘వ్యాగన్‌ఆర్‌’ | New Maruti Wagon R 2019 Launch Today | Sakshi
Sakshi News home page

మార్కెట్లోకి కొత్త ‘వ్యాగన్‌ఆర్‌’

Jan 24 2019 12:51 AM | Updated on Jan 24 2019 12:51 AM

New Maruti Wagon R 2019 Launch Today - Sakshi

న్యూఢిల్లీ: మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ).. తన వ్యాగన్‌–ఆర్‌ శ్రేణిలో నూతన వెర్షన్‌ను బుధవారం మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ కారును ‘బిగ్‌ న్యూ వ్యాగన్‌ఆర్‌’గా అభివర్ణించిన సంస్థ.. 1.2 లీటర్ల పెట్రోల్‌ ఇంజిన్‌తో పాటు మరో ఆప్షన్లో భాగంగా 1–లీటర్‌ ఇంజిన్‌ను కూడా అందుబాటులో ఉంచింది. 1.2 లీటర్‌ ఇంజిన్‌ కారు ధరల శ్రేణి రూ.4.89 లక్షలు–రూ.5.69 లక్షలు. 1–లీటర్‌ ఇంజిన్‌ ధరల శ్రేణి రూ.4.19 లక్షలు–రూ.4.69 లక్షలు కాగా, ఈ విభాగంలోని ఆటోమేటెడ్‌ గేర్‌ షిఫ్ట్‌ ధర రూ.5.16 లక్షలు. హై టెన్షన్‌ స్టీలును వాడడం వల్ల నూతన వేరియంట్లో శబ్దం, కుదుపులు తక్కువగా ఉంటాయని కంపెనీ తెలిపింది. ‘ఈ కారు కేవలం ఫ్యామిలీనే కాకుండా, యువ కొనుగోలుదారులను కూడా మంచి చాయిస్‌ కానుంది.’ అని సంస్థ సీఈఓ కెనిచి అయుకవా మాట్లాడుతూ..  వ్యాఖ్యానించారు. 

జీఎస్‌టీ గణనీయంగా తగ్గాలి: ప్రస్తుతం ఆటోమొబైల్స్‌పై 28% జీఎస్‌టీ రేటు, ఇందుకు అదనంగా 15% సెస్‌ అమల్లోఉండగా.. ఇవి తగ్గాల్సిన అవసరం ఉందని కెనిచి అయుకవా అన్నారు. జీఎస్‌టీ తగ్గడం వల్ల పరిశ్రమ మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement