కేజీ బేసిన్‌లో కొత్త ఇంధనం... | New energy source discovered off Andhra coast | Sakshi
Sakshi News home page

కేజీ బేసిన్‌లో కొత్త ఇంధనం...

Feb 28 2019 12:32 AM | Updated on Feb 28 2019 12:32 AM

New energy source discovered off Andhra coast - Sakshi

బెంగళూరు: ఆంధ్రప్రదేశ్‌ పరిధిలోని కృష్ణా–గోదావరి (కేజీ) బేసిన్‌లో పరిశోధకులు కొత్త ఇంధనాన్ని కనుగొన్నారు. కేజీ బేసిన్‌లో మీథేన్‌ హైడ్రేట్స్‌ను కనుగొన్నట్లు జర్నల్‌ ఆఫ్‌ ఎర్త్‌ సిస్టమ్‌ సైన్స్‌లో ప్రచురితమైన ఒక ఆర్టికల్‌లో నేషనల్‌ జియోఫిజికల్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ (హైదరాబాద్‌), నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషనోగ్రఫీ(గోవా) శాస్త్రవేత్తల బృందం పేర్కొంది. భారీ పరిమాణంలో మీథేన్‌ వాయువున్న ఐస్‌ముక్క లాంటి పదార్థాన్ని మీథేన్‌ హైడ్రేట్‌గా వ్యవహరిస్తారు.
 

ప్రస్తుతం ఇంధనంగా ఉపయోగిస్తున్న సహజవాయువులో కీలకమైనది మీథేన్‌ వాయువే. రాబోయే రోజుల్లో ఇంధన అవసరాలను భారీగా తీర్చేందుకు ఇది ఉపయోగపడగలదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. భారత్‌ సముద్ర జలాల్లో గ్యా స్‌ హైడ్రేట్‌ నిక్షేపాల రూపంలో లక్షల కోట్ల ఘనపు మీటర్ల మీథేన్‌ గ్యాస్‌ ఉండొచ్చని కేంద్ర ఎర్త్‌ సైన్సెస్‌ శాఖ అంచనా. వీటి వెలికితీతకు 2012–17 మధ్యలో ప్రభుత్వం రూ. 143 కోట్ల వ్యయం చేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement