కెనరాబ్యాంక్, బీఓబీ, బీఓఐలకు కొత్త సీఈఓలు 

New CEOs For Canara Bank, BOB And BOI - Sakshi

న్యూఢిల్లీ: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ), బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (బీఓఐ), కెనరాబ్యాంక్‌లకు కొత్త ఎండీ అండ్‌ సీఈఓలు నియమితులయ్యారు. నియామకపు వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ ఈ నియామకాలకు ఆమోదముద్ర వేసింది.   
బీఓబీ: సంజయ్‌ చంద్ర ఎండీ అండ్‌ సీఈఓగా నియమితులయ్యారు. ప్రస్తుతం సంజయ్‌ చంద్ర బ్యాంకింగ్‌ దిగ్గజం– స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పీఎస్‌ జయకుమార్‌ స్థానంలో సంజయ్‌ చంద్ర నియామకం జరిగింది.   
బీఓఐ: బ్యాంక్‌ ఎండీ సీఈఓగా అతనూ కుమార్‌ దాస్‌ నియమితులయ్యారు. ప్రస్తుతం దాస్‌ ఇదే బ్యాంక్‌లో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఎండీ అండ్‌ సీఈఓ కుర్చీ గత ఏడాది జూలై నుంచీ భర్తీకాలేదు.  
కెనరా బ్యాంక్‌: లింగమ్‌ వెంకట్‌ ప్రభాకర్‌ ఎండీ అండ్‌ సీఈఓగా నియమితులయ్యారు. ప్రభాకర్‌ పీఎన్‌బీలో ఈడీగా బాధ్యతలు నిర్వహించారు. ఈ నెలాఖరున రిటైర్‌ కానున్న ఆర్‌ఏ శంకర్‌ నారాయణన్‌ స్థానంలో బాధ్యతలు చేపడతారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top