
శిరిడిసాయి ఎలక్ట్రికల్స్‌కు ఎన్‌ఈసీఏ అవార్డు
నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు(ఎన్‌ఈసీఏ)-2014 జాతీయ స్థాయిలో కడపకు చెందిన శిరిడిసాయి ఎలక్ట్రికల్స్ ..
సాక్షి ప్రతినిధి, కడప:నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు(ఎన్‌ఈసీఏ)-2014 జాతీయ స్థాయిలో కడపకు చెందిన శిరిడిసాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్‌కు దక్కింది. మ్యాండెటరీ లేబులింగ్ విభాగంలోని డిస్ట్రిబ్యూషన్ టాన్సుఫార్మర్స్ వింగ్‌కు గాను శిరిడిసాయి ఎలక్ట్రికల్స్‌కు ఈ అవార్డు దక్కింది. ఆమేరకు న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి పియూష్ గోయల్ చేతుల మీదుగా సంస్థ ఎండి నర్రెడ్డి విశ్వేశ్వరరెడ్డి ఈనెల 14న అందుకున్నారు.
కడప కేంద్రంగా 1994లో స్థాపితమైన శిరిడిసాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతోపాటు, మహారాష్ట్రలకు టాన్స్‌ఫార్మర్స్ సరఫరా చేస్తున్నది. ఎన్‌ఈసీఏ-2014 అవార్డు దక్కడంతో తమ బాధ్యత మరింత పెరిగిందని విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ట్రాన్స్‌ఫార్మర్లు ఉత్పత్తిలో నాణ్యత ప్రామాణాలు పాటించడంతోనే జాతీయస్థాయిలో అవార్డు అందుకోగలిగామని తెలిపారు. భవిష్యత్‌లో మరింత బాధ్యతాయుతంగా సంస్థ కార్యకలాపాలు నిర్వహించనున్నట్లు వివరించారు.