breaking news
Shirdi Sai Electricals
-
పబ్లిక్ ఇష్యూ ప్రణాళికల్లో ఇండోసోల్
హైదరాబాద్: షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ అనుబంధ సంస్థ ఇండోసోల్ సోలార్ వచ్చే ఆర్థిక సంవత్సరంలో పబ్లిక్ ఇష్యూకి వచ్చే ప్రణాళికల్లో ఉంది. రాబోయే కొన్నేళ్లలో రూ. 69,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ సీఎండీ ఎన్ విశ్వేశ్వరరెడ్డి ఈ విషయాలు వెల్లడించారు. ‘ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి ఆంధ్రప్రదేశ్‌లో 1 గిగావాట్ల సమగ్ర తయారీ లైన్ (ఇన్గోట్ నుంచి సెల్ మాడ్యూల్ వరకు) ప్రారంభించనున్నాం. ఆ తర్వాత ఐపీవోకి వచ్చే యోచన ఉంది. ప్రాథమికంగా, ప్రీ–ఐపీవో ప్లేస్మెంట్ ద్వారా 25–26 శాతం వాటా విక్రయించాలని భావిస్తున్నం‘ అని విశ్వేశ్వరరెడ్డి చెప్పారు. ఇండోసోల్లో షిర్డీ సాయి 51 శాతం వాటాలను తన దగ్గరుంచుకుని, దాదాపు 49 శాతం వరకు వాటాలను విక్రయించే అవకాశం ఉందని తెలిపారు. ఒకవేళ ఇండోసోల్ ఐపీవో గానీ కుదరకపోతే షిర్డీ సాయి ఎలక్ట్రికల్సే 2027 ఆర్థిక సంవత్సరంలో పబ్లిక్ ఇష్యూకి రావచ్చని ఆయన సూచనప్రాయంగా తెలిపారు. సోలార్ పీవీ తయారీ ప్లాంటు ఏర్పాటు కోసం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కారేడు గ్రామంలో 8,348 ఎకరాల స్థలం, అదే జిల్లాలోని చెవురు గ్రామంలో మరో 114.5 ఎకరాల స్థలాన్ని ఇండోసోల్కి కేటాయించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. భవిష్యత్ ప్రణాళికలు.. పాలీసిలికాన్కి ముడి వనరైన క్వారŠట్జ్ మైనింగ్కి సంబంధించి కర్నూలు, అనంతపురంలో మైనింగ్ హక్కులు దక్కించుకున్నామని విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. రూ. 25,000–రూ. 28,000 కోట్లతో ఫేజ్1లో భాగంగా తలపెట్టిన 10 గిగావాట్ల లైన్ వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి ఏర్పాటవుతుందని పేర్కొన్నారు. దీర్ఘకాలంలో 90,000 మిలియన్ టన్నుల (ఎంటీ) పాలీసిలికాన్ ఉత్పత్తి తదితర లక్ష్యాలతో ఇండోసోల్ ప్రాజెక్టుపై పెట్టుబడులు మొత్తం మీద రూ. 64,000 కోట్లుగా ఉంటాయని విశ్వేశ్వరరెడ్డి చెప్పారు. ఇందుకోసం అంతర్గతంగాను, అలాగే ఇండియన్ రెన్యువబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఇరెడా) నుంచి నిధులు సమీకరిస్తున్నట్లు తెలిపారు. బహుళ జాతి సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలతో కూడా సంప్రదింపులు జరుపుతున్నట్లు వివరించారు. మరోవైపు, షిర్డీ సాయి ఆర్డర్ బుక్ రూ. 12,000 కోట్లుగా ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రూ. 3,000 కోట్లుగా ఉండగా, ఈసారి రూ. 6,500 కోట్లు అంచనా వేస్తోంది. -
శిరిడిసాయి ఎలక్ట్రికల్స్‌కు ఎన్ఈసీఏ అవార్డు
సాక్షి ప్రతినిధి, కడప:నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు(ఎన్ఈసీఏ)-2014 జాతీయ స్థాయిలో కడపకు చెందిన శిరిడిసాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్‌కు దక్కింది. మ్యాండెటరీ లేబులింగ్ విభాగంలోని డిస్ట్రిబ్యూషన్ టాన్సుఫార్మర్స్ వింగ్‌కు గాను శిరిడిసాయి ఎలక్ట్రికల్స్‌కు ఈ అవార్డు దక్కింది. ఆమేరకు న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి పియూష్ గోయల్ చేతుల మీదుగా సంస్థ ఎండి నర్రెడ్డి విశ్వేశ్వరరెడ్డి ఈనెల 14న అందుకున్నారు. కడప కేంద్రంగా 1994లో స్థాపితమైన శిరిడిసాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతోపాటు, మహారాష్ట్రలకు టాన్స్‌ఫార్మర్స్ సరఫరా చేస్తున్నది. ఎన్ఈసీఏ-2014 అవార్డు దక్కడంతో తమ బాధ్యత మరింత పెరిగిందని విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ట్రాన్స్ఫార్మర్లు ఉత్పత్తిలో నాణ్యత ప్రామాణాలు పాటించడంతోనే జాతీయస్థాయిలో అవార్డు అందుకోగలిగామని తెలిపారు. భవిష్యత్‌లో మరింత బాధ్యతాయుతంగా సంస్థ కార్యకలాపాలు నిర్వహించనున్నట్లు వివరించారు.